Jawan OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న షారుఖ్ బ్లాక్ బస్టర్ హిట్.. ‘జవాన్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

ఇప్పటివరకు దాదాపు రూ.1000 కోట్ల వసూళ్లు రాబట్టింది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై సెస్సెషన్ సృష్టించింది. విడుదలై నెలరోజులు గడిచినప్పటికీ బాక్సాఫీస్ వద్ద జవాన్ దూకుడు మాత్రం తగ్గడం లేదు. ఈ సినిమాతో అటు సౌత్ ఇండస్ట్రీ లేడీ సూపర్ స్టార్ నయనతారకు బాలీవుడ్‏లో అడుగుపెట్టింది. తొలి చిత్రానికే నార్త్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అలాగే ఈ చిత్రంలో దీపికా పదుకొణె గెస్ట్ రోల్ చేసింది.

Jawan OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న షారుఖ్ బ్లాక్ బస్టర్ హిట్.. జవాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
Jawan

Updated on: Oct 08, 2023 | 8:00 AM

చాలా కాలం తర్వాత బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఖాతాలో భారీ విజయాన్ని అందుకున్న సినిమా జవాన్. ఎన్నో అంచనాల మధ్య అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పటివరకు దాదాపు రూ.1000 కోట్ల వసూళ్లు రాబట్టింది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై సెస్సెషన్ సృష్టించింది. విడుదలై నెలరోజులు గడిచినప్పటికీ బాక్సాఫీస్ వద్ద జవాన్ దూకుడు మాత్రం తగ్గడం లేదు. ఈ సినిమాతో అటు సౌత్ ఇండస్ట్రీ లేడీ సూపర్ స్టార్ నయనతారకు బాలీవుడ్‏లో అడుగుపెట్టింది. తొలి చిత్రానికే నార్త్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అలాగే ఈ చిత్రంలో దీపికా పదుకొణె గెస్ట్ రోల్ చేసింది.

బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. జవాన్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుందట. బాలీవుడ్ బాద్ షా పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 2న ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా థియేటర్లలో ప్రేక్షకులు చూడని సీన్స్ కలిపి ఓటీటీలో జవాన్ సినిమా ఉండబోతుందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. ఇక ఇటు థియేటర్లలో సక్సెస్ అయిన ఈ మూవీ ఓటీటీలోనూ అద్భుతమైన రెస్పాన్స్ అందుకోనుందని తెలుస్తోంది.

ఈ సినిమాలో షారుఖ్ ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో తండ్రి కొడుకులుగా కనిపించి మెప్పించారు. అలాగే దీపికా, నయన్ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇక అనిరుథ్ అందించిన సంగీతం సినిమాకు మరో హైలెట్. ఇప్పటికే అనేక సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన అట్లీ.. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ఈ మూవీని ప్రేక్షకుల ఎంతో ఆదరించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.