OTT Movie: ఇలాంటి లవ్ స్టోరీని ఎప్పుడూ చూసి ఉండరు.. ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు బోల్డ్ మూవీ.. IMDBలో 9 రేటింగ్

ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది.కేవలం మౌత్ టాక్ తోనే మంచి కలెక్షన్లు సాధించింది. ఇప్పటివరకు తెలుగులో ఇలాంటి లవ్ స్టోరీతో ఏ సినిమా రాలేదని మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇప్పుడీ తెలుగు బోల్డ్ అండ్ రొమాంటిక్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movie: ఇలాంటి లవ్ స్టోరీని ఎప్పుడూ చూసి ఉండరు.. ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు బోల్డ్ మూవీ.. IMDBలో 9 రేటింగ్
OTT Movie

Updated on: Nov 29, 2025 | 9:36 PM

ఓటీటీలోకి ఈ వారం ఎన్నో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు కూడా ఇప్పుడు వివిధ ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. ఇందులో ఒక తెలుగు బోల్డ్ అండ్ రొమాంటిక్ సినిమా కూడా ఉంది. ఇప్పటివరకు తెలుగులో ఇలాంటి లవ్ స్టోరీ రాలేదని రిలీజ్ కు ముందు మేకర్స్ తెలిపారు. అందుకు తగ్గట్టుగానే కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. కేవలం మౌత్ టాక్ తోనే మంచి వసూళ్లు రాబట్టింది. అయితే స్టార్ క్యాస్ట్ లేకపోవడం, పెద్దగా ప్రమోషన్లు చేయకపోవడంతో ఈ సినిమా లాంగ్ రన్ కొనసాగించలేకపోయింది. అయితే రిలీజ్ కు ముందు మేకర్స్ చెప్పినట్లే ఈ సినిమా స్టోరీ చాలా కొత్తగా ఉంది. అందుకే ఐఎమ్‌డీబీ లో పదికి ఏకంగా 9 రేటింగ్ కూడా సాధించుకుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రైల్వేలో చిన్న ఉద్యోగం చేసే శారద, తన కొడుకుని (హీరో)అల్లారుముద్దుగా పెంచుతుంది. బదిలీపై ఘట్కేసర్‌లోని రైల్వే కాలనీకి శారద కుటుంబం షిఫ్ట్ అవుతుంది. అక్కడే వీరికి హీరోయిన్ పరిచయమవుతుంది. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిన హీరో డైరెక్టుగా లవ్ బదులు ‘నీతో రొమాన్స్‌ చేయాలని ఉంది’ అని అడుగు తాడు. అమ్మాయి అతన్ని పెద్దగా కేర్ చేయదు. కానీ హీరో మాత్రం వెనక్కు తగ్గడు. ఓ టైమ్‌ టేబుల్‌ వేసుకొని మరీ, ఆమెని ఫాలో అవుతుంటాడు. దీంతో అనుకోని పరిస్థితుల్లో హీరోతో రొమాన్స్‌కి ఒప్పుకొంటుంది హీరోయిన్. కానీ ఓ విచిత్రమైన కండీషన్‌ పెడుతుంది. మరి ఆ కండీషన్ ఏంటి? అమ్మాయి కోసం అతడు పిచ్చోడిలా ఎందుకు మారాల్సి వచ్చింది? చివరకు ఈ ప్రేమికుల కథ చివరికి ఏమైంది? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఆసక్తికరమైన కథా కథనాలతో సాగే ఈ బోల్డ్ అండ్ రొమాంటిక్ సినిమా పేరు ప్రేమిస్తున్నా. ఎన్నో సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించిన సాత్విక్ వర్మ ఇందులో హీరోయిన్ గా నటించాడు. ప్రీతీ నేహా అనే అమ్మాయి హీరోయిన్‌గా చేసింది. భాను దర్శకత్వం వహించారు. న్యూ ఏజ్డ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం (నవంబర్ 28) నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. రొమాంటిక్ బోల్డ్ లవ్ స్టోరీ సినిమాలు ఇష్టపడేవారు ప్రేమిస్తున్నా సినిమాపై ఓ లుక్కేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆహాలో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి