Samantha: సమంత వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

|

Jul 25, 2024 | 8:24 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలతో పాటు గతంలో ఫ్యామినీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ లో సామ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఆ సిరీస్ దర్శకులు రాజ్, డీకే దర్శకత్వంలోనే మరో వెబ్ సిరీస్ లో నటిస్తోంది సమంత. అదే 'సిటాడెల్: హనీ బానీ'. ఈ క్రేజీ వెబ్ సిరీస్ లో సామ్ కు జోడీగా బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో వరుణ్ ధావన్ నటించాడు

Samantha: సమంత వెబ్ సిరీస్ సిటాడెల్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Citadel Honey Bunny Web Series
Follow us on

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలతో పాటు గతంలో ఫ్యామినీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ లో సామ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఆ సిరీస్ దర్శకులు రాజ్, డీకే దర్శకత్వంలోనే మరో వెబ్ సిరీస్ లో నటిస్తోంది సమంత. అదే ‘సిటాడెల్: హనీ బానీ’. ఈ క్రేజీ వెబ్ సిరీస్ లో సామ్ కు జోడీగా బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో వరుణ్ ధావన్ నటించాడు. ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకొంటోన్న సిటాడెల్ వెబ్ సిరీస్ కు గుమ్మడి కాయ కొట్టినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్ విడుదల తేదీని ప్రకటించేందుకు చిత్రబృందం సిద్ధమైంది. తాజాగా దర్శకుడు రాజ్ అండ్ డీకే సోషల్ మీడియాలో ఒక పోస్టును షేర్ చేసుకున్నాడు. ఇందులో ‘01.08’ తప్ప మరేమీ లేదు. దీన్ని నెటిజన్లు డీకోడ్ చేస్తున్నారు. ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ విడుదల తేదీని ఆగస్టు 1న ప్రకటించే అవకాశం ఉంది. అదే సమయంలో ఆగస్టు 1 నుంచే సిటాడెల్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వస్తుందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఇది సిరీస్ రిలీజ్ డేటేనా లేక ఆరోజున మరో డేట్ తో ఎప్పుడు రాబోతుంది అనేది రివీల్ చేస్తారా అనేది చూడాలి. దీనిపై సమంత రూత్ ప్రభు, వరుణ్ ధావన్ అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.

సిటాడెల్: హనీ బానీ’ వెబ్ సిరీస్‌లో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. నటి సమంత రూత్ ప్రభు ఈ సిరీస్ కోసం చాలా కష్టపడింది. అనారోగ్యంతో బాధపడుతున్నా చాలా కాలం శిక్షణ తీసుకుని మరీ షూటింగ్ లో పాల్గొంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ క్రేజీ వెబ్ సిరీస్ ను నిర్మించింది. OTTలో ప్రసారం కానున్న ఈ సిరీస్‌ని చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సమంత యాక్షన్ సీన్స్ పై చాలా హైప్ క్రియేట్ అయ్యింది. కాగా ఒరిజినల్ సిరీస్ లో హాలీవుడ్ నటుడు రిచర్డ్ మాడన్ నటించగా తన రోల్ లో ఇండియన్ వెర్షన్ కి గాను వారు ధావన్ నటించాడు. అలాగే ఈ సిరీస్ ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ గా రాబోతుంది. సమంత, వరుణ్ ధావన్ మాత్రమే కాదు సోహమ్ మజుందార్, కె.కె. మీనన్, సిమ్రాన్, శివాంకిత్ సింగ్ రేహాష్, సాహిబ్ సలీం, కశ్వీ మజుందార్, సికందర్ ఖేర్ తదితరులు ‘సిటాడెల్: హనీ బానీ’ వెబ్ సిరీస్‌లో నటించారు. ఇది హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.