Aindham Vedham OTT: ఓటీటీలో వణుకు పుట్టించే థ్రిల్లర్ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

|

Oct 18, 2024 | 2:13 PM

ప్రస్తుతం ఓటీటీలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకు మంచి క్రేజ్ ఉంది. ప్రధానంగా సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్, హార్రర్ జానర్ సిరీస్ లను ఓటీటీ ఆడియెన్స్ బాగా ఆసక్తిగా చూస్తున్నారు. అందుకు తగ్గట్టే పలు ఓటీటీ సంస్థలు ఆసక్తికర వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి.

Aindham Vedham OTT: ఓటీటీలో వణుకు పుట్టించే థ్రిల్లర్ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
Aindham Vedham Web Series
Follow us on

అభిరామి మీడియా వర్క్స్ బ్యానర్ మీద అభిరామి రామానాథన్, నల్లమై రామనాథన్ నిర్మించిన ఒరిజినల్ వెబ్ సిరీస్‌ ఐందామ్ వేదం. ఎల్. నాగరాజన్ ఈ మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. ఈ సిరీస్ లో సాయి ధన్సిక, సంతోష్ ప్రతాప్, వివేక్ రాజగోపాల్, వై.జి. మహేంద్రన్, క్రిషా కురుప్, రాంజీ, దేవదర్శిని, మాథ్యూ వర్గీస్, పొన్వన్నన్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సిరీస్ జీ5 ద్వారా ఆడియెన్స్ ముందుకు అక్టోబర్ 25న రాబోతోంది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన టీజర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఐందామ్ వేదం నుంచి ట్రైలర్‌ను మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విడుదల చేశారు. ‘వెయ్యేళ్లకు ఒకసారి గురుడు, శుక్రుడు, శని, కుజుడు ఈ నాలుగు గ్రహాలు సూర్యుడ్ని చూసే విధంగా ఒకే వరుసలో ఉంటాయట.. అలా జరిగినప్పుడు అద్భుతం జరుగుతుందని చరిత్ర చెబుతుంది’, ‘నాలుగు వేదాలు ఉన్నాయి.. ఐదో వేదం ఇప్పుడు బయటకు రాబోతోంది’ అంటూ సాగిన ఈ ట్రైలర్‌లో ఎన్నో అంతు చిక్కని రహస్యాలను చూపించబోతోన్నట్టుగా కనిపిస్తోంది.

మర్డర్, మిస్టరీ, థ్రిల్లర్, సోషియ ఫాంటసీ ఇలా అన్నింటిని కలిపి నాగ ఈ ‘ఐందామ్ వేదం’ను అద్భుతంగా తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. ట్రైలర్‌‌లో చూపించిన విజువల్స్, ఇచ్చిన ఆర్ఆర్, భయపెట్టేలా చేసిన కెమెరా వర్క్, యాక్షన్ సీక్వెన్స్ ఇవన్నీ కూడా హైలెట్ అవుతున్నాయి. ‘ఐందామ్ వేదం’ జీ5 ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు ఓటీటీలోకి అక్టోబర్ 25న రాబోతోంది. అందరికీ తెలిసిన నాలుగు వేదాలు కాకుండా.. ఐదో వేదాన్ని జీ5 అందరికీ చూపించబోతోండటం ఆసక్తికరంగా ఉంది. ఈ వెబ్ సిరీస్ కు శ్రీనివాసన్ దేవరాజన్ కెమెరామెన్ గా వ్యవహరించగా, రేవా స్వరాలు సమకూర్చారు. రెజీష్. ఎం.ఆర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

ఇవి కూడా చదవండి

విజయ్ సేతుపతి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్..

ఐందామ్ వేదం ట్రైలర్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.