OTT Movie: హాస్పిటల్ రూమ్ నెంబర్ 7లో ఏముంది? ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్.. ఒంటరిగా చూడొద్దు

ఆడియెన్స్ ను భయపెట్టేందుకు మరో సూపర్ హారర్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. పోస్టర్స్, టీజర్స్ తోనే హడలెత్తించిన ఈ సిరీస్ శుక్రవారం (నవంబర్ 27) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ వీకెండ్ లో మంచి హారర్ థ్రిల్లర్ చూడాలనుకునేవారికి ఈ సిరీస్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

OTT Movie: హాస్పిటల్ రూమ్ నెంబర్ 7లో ఏముంది? ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్.. ఒంటరిగా చూడొద్దు
OTT Movie (3)

Updated on: Nov 27, 2026 | 4:08 PM

ఎప్పటిలాగే ఈ శుక్ర వారం కూడా ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు వచ్చాయి. ఆనంది గరివిడి లక్ష్మి, వెంకటేష్ ఆదర్శ కుటుంబం, హిందీ దృశ్యం 3.. ది కంక్లూజన్, హనుమాన్ అంశ్.. ఇలా వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అయితే వీటితో పాటే ఆడియెన్స్ ను భయపెట్టేందుకు ఓ హారర్ థ్రిల్లర్ కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇదొక ఆంథాలజీ సిరీస్. తెలుగు, తమిళం భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్‌తో పాటు తమిళ నటుడు నట్టి, నటి దివ్య గణేశన్ ఈ సిరీస్ లో ప్రధాన పాత్రలు పోషించారు. ఎం. కంపెనీ బ్యానర్‌పై నిర్మించిన ఈ ఆంథాలజీ సిరీస్ కథలు కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉంటున్నాయని తెలుస్తోంది. ఇటీవలే ఈ సిరీస్ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్ ఆడియెన్స్ ను బాగా భయపెట్టాయి. దీంతో ఈ సిరీస్ పై ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఇక తాజాగా స్ట్రీమింగ్ కు వచ్చిన మొదటి ఎపిసోడ్ స్టోరీ విషయానికి వస్తే.. ఓ ఆస్పత్రిలో రూమ్ నెంబర్ 7 మిస్టరీ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆస్పత్రిలో కొత్తగా నర్సుగా చేరిన మంజుకు (దివ్య గణేశన్) ఊహించని ఘటనలు, అనుభవాలు ఎదురవుతాయి. ముఖ్యంగా రూం నెం.7లో ఏదో గుర్తు తెలియని శక్తులు ఆమెను భయపెడుతుంటాయి. మరి అసలు మంజు ఎవరు? ఎందుకు ఆ పాడుబడిన ఆస్పత్రిలో నర్సుగా చేరింది? గది నెం 7 మిస్టరీ ఏంటి? నిజంగా అందులో దెయ్యాలు ఉన్నాయా? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.

‘వేర్వేరు ప్రదేశాలు, వేర్వేరు వ్యక్తులు, ఒకే భయం’ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సిరీస్ లో మొత్తం నాలుగు భయానక స్టోరీలను చూపించనున్నారు. మరి మిగిలిన కథలు ఎలా ఉన్నాయో చూడాలంటే సిరీస్ ఫాలో కావాల్సిందే. ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న ఈ ఆంథాలజీ సిరీస్ పేరు ‘రాతిరి’. ఈ సిరీస్ లో ఫస్ట్ ఎపిసోడ్ ‘ది రూమ్’ శుక్రవారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ ఆంథాలజీ వెబ్ సిరీస్ ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం భాషల్లోనూ ఈ హారర్ థ్రిల్లర్ అందుబాటులో ఉంది. వీకెండ్ లో మంచి హారర్ థ్రిల్లర్ చూడాలనుకునేవారికి ‘రాతిరి’ ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

ఆహాలో రాతిరి ఆంథాలజీ సిరీస్..

 

Loading...
Unable to load recommendations.
Follow Us