
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ ది రివేంజ్’ (ధురందర్ 2) మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు నుంచే కలెక్షన్ల రికార్డుల వేట మొదలు పెట్టింది. కోట్లాది రూపాయల కలెక్షన్లు రాబట్టి ఇప్పటికే ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై నెల రోజులు కావొస్తున్నా హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతోంది. ఇప్పటికే రూ.1750 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ రూ. 2000 కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉంటే థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోన్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. అగ్రిమెంట్ ప్రకారం థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాతనే ఈ సినిమా ఓటీటీలోకి రావాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే మే 14వ తేదీ నుంచి ధురంధర్ 2 స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం తదితర భాషల్లో ఒకే రోజు ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్ మాత్రమే. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ ది రివేంజ్ సినిమాలో రణ్ వీర్ సింగ్ సరసన సారా అర్జున్ కథానాయికగా నటించింది. అలాగే అక్షయ్ ఖన్నా, అర్జున్ రామ్ పాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
కాగా ధురంధర్ ది రివేంజ్ చిత్రం ఇండియాలోనే అత్యధిక ఫుట్‌ఫాల్స్ నమోదు చేసుకొన్నది. అంటే దేశవ్యాప్తంగా అత్యధిక మంది ప్రేక్షకులు చూసిన చిత్రాల్లో ఒకటిగా రికార్డులోకెక్కింది. మరి థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
The only franchise in the history of indian cinema to cross 3000 crore with just two films
– #Dhurandhar
– #DhurandharTheRevenge pic.twitter.com/fTtKVnXUYr— ALLWood Reviews (@AllwoodReviews) April 18, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.