
చార్లీ 777, సప్త సాగరాలు దాటి సైడ్-ఏ, బి సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువై పోయాడు కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ రక్షిత్ సినిమాలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో రక్షిత్ సినిమా వచ్చిందంటే సమ్‌థింగ్ డిఫరెంట్ ఏదో ఉంటుందని ఫిక్స్ అయిపోయారు తెలుగు ప్రేక్షకులు. ఇప్పుడు అలాంటి వారి కోసం రక్షిత్ శెట్టి మరో సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. అయితే ఇందులో రక్షిత్ హీరో కాదు. ప్రొడ్యూసర్. అతను నిర్మించిన కామెడీ మూవీ బ్యాచిలర్ పార్టీ గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 26న కన్నడ నాట రిలీజైంది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన బ్యాచిలర్ పార్టీ మూవీ ఇప్పుడు సడెడన్ గా ఓటీటీలోకి వస్తోంది. కేవలం ఒక్క రోజు ముందే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావడం గమనార్హం. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడయో బ్యాచిలర్ పార్టీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 4 అంటే సోమవారం నుంచే ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు అధికారికంగా అనౌన్స్ మెంట్ ఇచ్చారు. అయితే ఓటీటీ స్ట్రీమింగ్ అనేది కేవలం కన్నడ వరకే ఉంటుందా? లేదా తెలుగు డబ్బింగ్ కూడా అందుబాటులోకి తీసుకొస్తారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
అభిజిత్ మహేష్ తెరకెక్కించిన బ్యాచిలర్ పార్టీ సినిమాను. పరమ్ వహ్ స్టూడియోస్ బ్యానర్‌పై రక్షిత్ శెట్టి, జీఎస్ గుప్తా సంయుక్తంగా నిర్మించారు. దిగంత్, అచ్యుత్ కుమార్, యోగేష్, సిరి రవికుమార్, బాలాజీ మనోహర్, ప్రకాష్ తుమినాడ్, పవన్ కుమార్, శోభరాజ్, సుధ బెల్వాడీ తదితరులు నటించారు. అర్జున్ రాము స్వరాలు సమకూర్చారు. భిజిత్ మహేష్, వీరేష్ శివమూర్తి, గణేష్ వశిష్ట మాటలు అందించగా, అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.
Join the chaotic trio in their adventure! ‘Bachelor Party’ streaming on Amazon Prime from Monday✨♥️ pic.twitter.com/g57XxTD05k
— Paramvah Studios (@ParamvahStudios) March 2, 2024
Delivering a laughter-packed punch,delightful rollercoaster of humor that keeps d audnce in splits 4rm start 2 finish,director’s skillful execution & d film’s originality in humor make it a standout in d comedy genre #BachelorParty @rakshitshetty @diganthmanchale @LooseMada_Yogi pic.twitter.com/IsQF399KNu
— Prajwal Shetty (@itsprajshetty) January 30, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.