Return Of The Dragon OTT: అఫీషియల్.. ఓటీటీలోకి లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

|

Mar 18, 2025 | 4:48 PM

లవ్ టుడే తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్. ముఖ్యంగా జూనియర్ ధనుష్ గా యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అతను నటించిన తాజా చిత్రం  రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది

Return Of The Dragon OTT: అఫీషియల్.. ఓటీటీలోకి లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Return Of The Dragon Movie
Follow us on

లవ్‌ టుడే ఫేమ్‌ ప్రదీప్‌ రంగనాథన్‌ నటించిన తాజా చిత్రం ‘రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’.  అశ్వత్‌ మారిముత్తు తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో . అనుపమ పరమేశ్వరన్‌, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 21న తమిళంతో పాటు తెలుగులోనూ ఒకే సారి థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా యూత్ ను ఈ మూవీ బాగా ఆకట్టుకుంది. ప్రదీప్ రంగనాథన్ తన యాక్టింగ్ తో మరోసారి అదరగొట్టాడు. అనుపమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన స్క్రీన్ ప్రజెన్స్ తో మరోసారి ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో కుర్రకారు కొత్త క్రష్ గా మారిపోయింది కయాదు లోహర్.   డైరెక్టర్ శంకర్, బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ లాంటి ప్రముఖులు సైతం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీపై ప్రశంసలు కురిపించారు.  కేవలం రూ. 35 కోట్లతో తెరకెక్కించిన డ్రాగన్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ. 150 కోట్ల మార్క్‌ కలెక్షన్లకు పైగా వసూళ్లతో దూసుకెళుతోంది. ఇప్పటికీ పలు చోట్ల థియేటర్లలో ఈ మూవీ ఆడుతోంది. అయితే అంతలోనే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.  మార్చి 21 నుంచి ఈ సినిమా ఓటీటీలోకి రానుందని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా  ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి ఈ మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులో రానుంది.

ఏజీఎస్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై  అర్చనా కల్పతి రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాను నిర్మించారు. హీరో, హీరోయిన్లతో పాటు మిస్కిన్, గౌతమ్ వాసుదేమ్ మేనన్, కే.ఎస్. రవికుమార్, జార్జ్ మరియన్, ఇవానా, స్నేహ, అన్వేషి జైన్ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. లియోన్ జేమ్స్ అందించిన స్వరాలు సూపర్ హిట్ గా నిలిచాయి. మరి థియేటర్లలో ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ను మిస్ అయ్యారా? అయితే మరో మూడు రోజులు ఆగండి. ఎంచెక్కా ఇంట్లోనే ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి