వెండితెరపై సినిమాను రియలిస్టిక్‌గా చూపిస్తూ.. సూపర్ హిట్ అందుకుంటారు క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. రావడం కాస్త ఆలస్యమైన ప్రేక్షకులు మర్చిపోలేని చిత్రాలను అందించడంలో ముందుంటారు.. గత రెండెళ్లుగా థియేటర్లకు దూరంగా ఉంటున్న ఆడియన్స్‌ను భారీ సంఖ్యలో థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యారు.. ఆయన తెరకెక్కించిన అందమైన ప్రేమకథ లవ్‌స్టోరీ సెప్టెంబర్ 24న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నాగచైతన్య, సాయిపల్లవిల జోడీకి ప్రేక్షకులను ఫిదా అయ్యారు.. విడుదలైన మొదటి రోజునే.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కులవివక్షత.. అమ్మాయిల పట్ల ప్రస్తుతం జరుగుతున్న సంఘటన నేపథ్యంలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది.
ఇక మరోసారి లవ్ స్టోరీ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా.. ఈ మూవీ డిజిటల్ రైట్స్ దక్కించుకుంది. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ అందిస్తూ టాప్ ప్లేస్‌లో దూసుకుపోతున్న ఓటీటీ మాధ్యమం.. ఆహా మరోసారి అందమైన ప్రేమకథను ఆడియన్స్ ముందుకు తీసుకువస్తుంది. నాగచైతన్య, సాయిపల్లవిలు జోడీగా నటించిన లవ్ స్టోరీ సినిమా అక్టోబర్ 22న సాయంత్రం 6 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. అంతేకాకుండా.. లవ్ స్టోరీ ట్రైలర్ సైతం విడుదల చేసింది. ఇక ఈ సినిమాలో నాగచైతన్య.. జుంబా కోచ్. .. రేవంత్ పాత్రలో .. సాయి పల్లవి మౌనిక పాత్రలో నటించి మెప్పించారు..
Also Read: MAA Elections 2021: మా ఎన్నికల్లో మరో ట్వీస్ట్.. రంగంలోకి పోలీసులు.. సీసీ ఫుటేజ్ సీజ్ …
K. Raghavendra Rao: ఈ అమ్మాయి ఎలా చేస్తుందో అని అనుకున్నాను.. : కె. రాఘవేంద్రరావు
Pragya Jaiswal: అందాల కంచెలు తెంచేస్తున్న హాట్ బ్యూటీ.. వయ్యారాల ప్రగ్యా జైశ్వాల్ లేటెస్ట్ పిక్స్..
Mega Powerstar Ram Charan: ప్రశాంత్ నీల్ సినిమా పై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్.. ఏమన్నాడంటే..