ప్రస్తుతం ధూత వెబ్ సిరీస్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు అక్కినేని నాగచైతన్య. డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ డిసెంబర్ 1న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. విక్రమ్ గతంలో మనం సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ అక్కినేని ఫ్యామిలీకి చాలా స్పెషల్. ఎందుకంటే ఇందులో నాగేశ్వరరావు, నాగార్జున, చైతూ, అఖిల్ ఇలా అంతా కలిసి నటించారు. అందుకే ఇప్పుడు మరోసారి విక్రమ్ డైరెక్షన్ లో చైతూ ఓటీటీలోకి అడుగుపెడుతున్నారు. ఇదిలా ఉంటే.. ధూత సిరీస్ లో జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడు చైతూ. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. ధూత వెబ్ సిరీస్ అన్ని భాషల్లో విడుదలవుతుండడంతో దేశవ్యాప్తంగా మీడియాతో ముచ్చటిస్తున్నాడు చైతూ. ఈ క్రమంలోనే ఇటీవల పింక్ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతూ మాట్లాడుతూ.. తన మాజీ భార్య సమంత నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సిరీస్ తన మనసును కదిలించిందని అన్నారు.
ఈ ఇంటర్వ్యూలో రాపిడ్-ఫైర్ రౌండ్ లో భాగంగా ఓటీటీలో ఇప్పటివరకు మిమ్మల్ని ఎక్కువగా ఆకట్టుకున్న భారతీయ వెబ్ సిరీస్ ఏది అని అడగ్గా.. వెంటనే ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ అన్నాడు చైతూ. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తన మనసును కదిలించినది అని అన్నాడు. దీంతో ప్రస్తుతం చైతూ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇదిలా ఉంటే.. సమంత.. ది ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్‌తో ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సిరీస్‌లో సామ్ విలన్ పాత్రలో నటించింది.
ఇందులో రాజీ పాత్రలో సామ్ తన నటనకు విమర్శకులు, ప్రేక్షకుల నుండి ప్రశంసలను పొందింది. ఈ ధారావాహికలో మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి, శరద్ కేల్కర్, నీరజ్ మాధవ్, షరీబ్ హష్మీ, దలీప్ తాహిల్, సన్నీ హిందూజా, శ్రేయా ధన్వంతరి కీలకపాత్రలలో నటించారు. నాగ చైతన్య, సమంత తమ నాల్గవ వివాహ వార్షికోత్సవానికి కొన్ని రోజుల ముందు సోషల్ మీడియాలో తమ విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Latest – #NagaChaitanya talk about Megastar #SalmanKhan.
” I’ve mentioned in previous interview, I’m a big fan of @BeingSalmanKhan sir “#SalmanKhan #Tiger3 #TheBullpic.twitter.com/6qyUL8SBJF
— Anurag (@im_salmanic) November 28, 2023
ఇక ఇదే ఇంటర్వ్యూలో చైతూ మాట్లాడుతూ.. తను షారుఖ్, సల్మాన్, సైఫ్ అలీ ఖాన్ అందరికీ వీరాభిమానని.. వీళ్లతో కలిసి పనిచేయాలని ఉందని అన్నారు. అలాగే ఇటీవల షారుఖ్ నటించిన జవాన్ సినిమా తనకు చాలాబాగా నచ్చిందని అన్నారు. అలాగే లవ్ స్టోరీ తర్వాత మరోసారి సాయి పల్లవితో నటించడం చాలా సంతోషంగా ఉందని.. అన్నాడు. వీరిద్దరి కలయికలో తండెల్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
countless secrets, multiple mysteries and one man on a quest to find the truth 👀
#DhoothaOnPrime, Dec 1@chay_akkineni @parvatweets @priya_Bshankar @ItsPrachiDesai @Vikram_K_Kumar @nseplofficial @sharrath_marar @NambuShalini #NeelimaSMarar #MikolajSygula @NavinNooli pic.twitter.com/WA94pgw6qc
— prime video IN (@PrimeVideoIN) November 23, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.