
ప్రస్తుతం హారర్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలదే హవా. భాషతో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలను చూసేస్తున్నారు ఆడియెన్స్. ముఖ్యంగా ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లను తెగ చూసేస్తున్నారు ఆడియెన్స్. అందులోనూ ఈ మధ్యన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు, సిరీస్ లకు భారీ వ్యూయర్ షిప్ ఉంటోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక రియల్ క్రైమ్ స్టోరీ గురించే. పెద్ద పెద్ద నగరాల్లో జరుగుతోన్న కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులు, అలాగే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఐఎమ్ డీబీలోనూ ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి టాప్ రేటింగ్ దక్కడం విశేషం. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అమ్మాయిల కిడ్నాప్, బెగ్గర్ మాఫియా, ప్రాణాంతకమైన మెడికల్ ఎక్స్ పెరిమెంట్స్ తదితర అంశాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఓ విదేశీ రాయబారి కుమార్తె కిడ్నాప్ అవుతుంది. హై ప్రొఫైల్ కేస్ కావడంతో పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారు. ఇదే క్రమంలో ఇన్వెస్టిగేషన్ లో వారికి షాకింగ్ విషయాలు తెలుస్తాయి. కిడ్నాప్ అయ్యింది కేవలం ఒక్క రాయబారి కుమార్తె మాత్రమే కాదని… ఢిల్లీలో చాలా మంది అమ్మాయిలు మిస్ అయ్యారని తెలుస్తుంది. అందులోనూ మెచ్యూర్ కాని అమ్మాయిలనే అపహరించినట్లు పోలీసులు తెలుసుకుంటారు. మరి ఈ కిడ్నాప్ మిస్టరీ వెనక ఉన్నదెవరు? మెచ్యూర్ కాని అమ్మాయిలనే ఎందుకు కిడ్నాప్ చేశారు? పోలీసులు ఈ కేసును ఎలా పరిష్కరించారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే
ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాల్సిందే.
ప్రస్తుతం ఓటీటీలో ఉన్న ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలలో మర్దానీ ఫ్రాంఛైజీ కూడా ఒకటి. బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. అలా ఈ ఫ్రాంఛైజీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రం ‘మర్దానీ 3’. అంతకు ముందు వచ్చిన మర్దానీ (2014), మర్దానీ 2 (2019) ల కంటే ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా నే ఉన్నాయి. దర్శకుడు అభిరాజ్ మినావాలా తెరకెక్కించిన ఈ సినిమాలో శివానీ శివాజీ రాయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో రాణి ముఖర్జీ అదరగొట్టింది. అలాగే జానకి బోడివాలా, మల్లికా ప్రసాద్, జిషు సేన్ గుప్తా, ఇంద్రనీల్ భట్టాచార్య, నవేద్ అస్లామ్ తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. వీకెండ్ లో మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి ‘మర్దానీ 3’ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. అయితే ఇందులో హింసాత్మకమైన సన్నివేశాలు, అభ్యంతరకరమైన డైలాగులు ఉన్నాయి. కాబట్టి పిల్లలతో చూడకపోవడమే మంచిది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.