
ప్రజెంట్ ఓటీటీల్లో క్రైమ్ స్టోరీస్, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ చిత్రాలకు మంచి ఆదరణ ఉంటోంది. అందులోనూ మలయాళం సినిమాలైతే మరీ డిమాండ్ ఉంటోంది. అందుకే అక్కడ హిట్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్ లను డబ్బింగ్ చేసి మరీ తెలుగులోనూ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా మలయాళం మిస్టరీ థ్రిల్లర్ సినిమానే. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ కంటెంట్ బేస్డ్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. మిస్టరీ హారర్ అంశాలకు టైమ్ ట్రావెల్ పాయింట్‌ను జోడించి తెరకెక్కిన ఈ సినిమాను చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా కథ కూడా చాలా కొత్తగా ఉంటుంది. కర్ణాటక – కేరళ సరిహద్దుల్లో అటవీ ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు బదిలీ అవుతాడు ఆనంద్ . అదే పోలీస్‌స్టేషన్‌లో రెజీ, స్టీఫెన్ అనే పోలీసులు పని చేస్తుంటారు. ఒక రోజు వీరు నైట్‌డ్యూటీకి వెళ్లగా అడవిలో ఓ శవం కనిపిస్తుంది. అయితే ఆ మృతదేహం దగ్గరకు వెళ్లిన వాళ్లందరూ ఓ ఆలయంలో చిక్కుకుపోతారు. ఆ విషయం తెలుసుకుని అడవిలోకి వచ్చిన ఆనంద్, అతడి టీమ్‌కు చిత్ర విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. మరి ఇంతకీ ఆ డెడ్ బాడీ ఎవరిది? ఎవరు హత్య చేశారు? కాకి ఆకారంలో ఉన్న ఆలయం వెనక ఉన్న ఆ మిస్టరీ ఏంటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, ఊహకు అందని ట్విస్టులతో సాగే ఈ సినిమా పేరు సంభవం అధ్యాయం ఒన్ను. జీతూ సతీషన్ తెరకెక్కించిన ఈ మూవీలో అస్కర్ అలీ, వినీత్ కుమార్, అస్సిమ్ జమాల్, సిద్ధార్థ్ భరత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మార్చిలో థియేటర్లలో రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 15 నుంచి ఈ సూపర్ హిట్ సినిమా స్ట్రీమింగ కు రానుంది. ఈ మేరకు జియో హాట్ స్టార్ నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఒరిజినల్ వెర్షన్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది.
Recent Mystery Fantasy Thriller 🔥#SambhavamAdhyayamOnnu (Malayalam) streaming from April 15 on JioHotstar in Malayalam , Tamil, Telugu, Kannada & Hindi 🍿!!#OTT_Trackerspic.twitter.com/1Rgq3mc0xG
— OTT Trackers (@OTT_Trackers) April 9, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.