OTT Movies: ఈ వారం ఓటీటీలో సినిమాల జాతర.. 25కు పైగా మూవీస్, వెబ్ సిరీస్‌లు.. ఫుల్ స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో
ప్రస్తుతం థియేటర్లలో దేవర హవా నడుస్తోంది. దీంతో ఇప్పట్లో పెద్ద సినిమాలు రిలీజయ్యే అవకాశం లేదు. ఉన్నంతలో శ్రీ విష్ణు స్వాగ్ కాస్త ఆసక్తికరంగా కనిపిస్తోంది. దీంతో పాటు రామ్ నగర్ బన్నీ, దక్షిణ, కలి, మిస్టర్ సెలబ్రిటీ సినిమాలు ఈ వారం థియేటర్లలోకి అడుగు పెడుతున్నాయి
ప్రస్తుతం థియేటర్లలో దేవర హవా నడుస్తోంది. దీంతో ఇప్పట్లో పెద్ద సినిమాలు రిలీజయ్యే అవకాశం లేదు. ఉన్నంతలో శ్రీ విష్ణు స్వాగ్ కాస్త ఆసక్తికరంగా కనిపిస్తోంది. దీంతో పాటు రామ్ నగర్ బన్నీ, దక్షిణ, కలి, మిస్టర్ సెలబ్రిటీ సినిమాలు ఈ వారం థియేటర్లలోకి అడుగు పెడుతున్నాయి. ఇక ఓటీటీలోనూ ఈ వారం దాదాపు 27 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అందులో నివేదా థామస్ నటించిన ’35 చిన్న కథ కాదు’ సినిమా ఇంట్రెస్ట్ గా ఉంది. థియేటర్లలో చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ ఓటీటీలోనూ రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు యోగి బాబు బోట్, కంట్రోల్ వంటి తెలుగు డబ్బింగ్ సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి.అలాగే హిందీ, ఇంగ్లిష్ భాషలకు చెందిన పలు సినిమాలు, సిరీస్ లు కూడా ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి ఈ వారం వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లపై ఒక లుక్కేద్దాం రండి.
నెట్‌ఫ్లిక్స్
మేకింగ్ ఇట్ ఇన్ మార్బెల్లా (స్వీడిష్ వెబ్ సిరీస్) – అక్టోబరు 01
టిమ్ దిల్లోన్ (ఇంగ్లిష్ సినిమా) – అక్టోబరు 01
చెఫ్స్ టేబుల్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబరు 02
లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 7 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబరు 02
అన్ సాల్వెడ్ మిస్టరీస్ వాల్యూమ్ 5 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబరు 02
హార్ట్ స్టాపర్ సీజన్ 3 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబరు 03
నింజాగో: డ్రాగన్స్ రైజింగ్ సీజన్ 2 పార్ట్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబరు 03
కంట్రోల్ (హిందీ సినిమా) – అక్టోబరు 04
ఇట్స్ వాట్స్ ఇన్ సైడ్ (ఇంగ్లిష్ సినిమా) – అక్టోబరు 04
ద ఫ్లాట్ ఫామ్ 2 (ఇంగ్లిష్ మూవీ) – అక్టోబరు 04
రన్మ 1/2 (జపనీస్ వెబ్ సిరీస్) – అక్టోబరు 05
ద సెవెన్ డెడ్లీ సిన్స్ ఫోర్ నైట్స్ ఆఫ్ ద అపాకలిప్స్ సీజన్ 2 (జపనీస్ వెబ్ సిరీస్) – అక్టోబరు 06