OTT Movies: ఈ వారం ఎంటర్‌టైన్మెంట్ అదిరిపోద్ది.. ఓటీటీలో 20కు పైగా సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
ఈ వారం కేవలం గెటప్ శీను నటించిన రాజు యాదవ్ అనే చిన్న సినిమా మాత్రమే థియేటర్లలోకి అడుగుపెట్టనుంది. అయితే ఓటీటీలో మాత్రం మస్త్ ఎంటర్‌టైన్మెంట్ ఉండనుంది. స్ట్రెయిట్ తెలుగు సినిమాలు పెద్దగా లేకపోయినా ఆసక్తికరమైన డబ్బింగ్ సినిమాలు ఈ వారం స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. వీటిలో గాడ్జిల్లా X కాంగ్ ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది
ఎప్పటిలాగే మరో వారం వచ్చేసింది. ఎలక్షన్లు, ఐపీఎల్ ఎఫెక్ట్ వల్ల గత కొన్ని వారాలుగా థియేటర్లలో పెద్ద సినిమాలు రావడం లేదు. ఈ వారం కూడా అదే పరిస్థితి. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదారి రిలీజ్ ఉన్నా ఏకంగా మే 31 కి వాయిదా పండింది. అలా ఈ వారం కేవలం గెటప్ శీను నటించిన రాజు యాదవ్ అనే చిన్న సినిమా మాత్రమే థియేటర్లలోకి అడుగుపెట్టనుంది. అయితే ఓటీటీలో మాత్రం మస్త్ ఎంటర్‌టైన్మెంట్ ఉండనుంది. స్ట్రెయిట్ తెలుగు సినిమాలు పెద్దగా లేకపోయినా ఆసక్తికరమైన డబ్బింగ్ సినిమాలు ఈ వారం స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. వీటిలో గాడ్జిల్లా X కాంగ్ ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే చోరుడు, ర హట్కే జర బచ్కే, బస్తర్ వంటి సినిమాలు కూడా చెప్పుకోదగ్గవే. మరి మొత్తం మీద ఈ వారం వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు వస్తోన్న సినిమాలు, సిరీస్ ల లిస్ట్ తెలుసుకుందాం రండి.