OTT Cinema : 7 ఏళ్లుగా ఓటీటీని ఏలుతున్న స్పై సిరీస్.. ధురంధర్ సినిమానే మించిపోయింది.. ఇప్పటికీ ట్రెండింగ్..

ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో విభిన్న కంటెంట్ చిత్రాలు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలతోపాటు.. వెబ్ సిరీస్ సైతం ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సిరీస్ దాదాపు ఏడు సంవత్సరాలుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ట్రెండ్ అవుతుంది. ఇప్పటికీ ఆ సిరీస్ చూసేందుకు జనాలు చాలా ఇష్టపడుతున్నారు. ఇంతకీ ఆ సిరీస్ ఏంటో తెలుసుకుందామా.

OTT Cinema : 7 ఏళ్లుగా ఓటీటీని ఏలుతున్న స్పై సిరీస్.. ధురంధర్ సినిమానే మించిపోయింది.. ఇప్పటికీ ట్రెండింగ్..
Bard Of Blood

Updated on: May 14, 2026 | 2:46 PM

ప్రస్తుతం ఓ సిరీస్ ఓటీటీలో దూసుకుపోతుంది. దాదాపు ఏడేళ్లుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సత్తా చాటుతుంది. మొత్తం ఏడు ఎపిసోడ్‌లతో కూడిన ఈ వెబ్ సిరీస్ 2019లో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. దీనికి రిభు దాస్‌గుప్తా దర్శకత్వం వహించారు. దీని కథ, నటీనటుల అద్భుతమైన నటన ప్రేక్షకులకు ఎంతగానో నచ్చడంతో, అప్పట్లో కూడా ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హాష్మీ ప్రధాన పాత్ర పోషించారు. అలాగే వినీత్ కుమార్ సింగ్, శోభితా ధూళిపాళ, కీర్తి కుల్హారి, జైదీప్ అహ్లావత్ కీలకపాత్రలు పోషించారు. ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కథ బిలాల్ సిద్ధిఖీ నవల ఆధారంగా రూపొందింది. ఇందులో ఇమ్రాన్ పాత్ర పేరు కబీర్ ఆనంద్. కబీర్ ఆనంద్ తాలిబన్ల బారి నుంచి తనను తాను కాపాడుకుంటూ మిషన్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో తనకు తన గతం సైతం ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

ఈ సిరీస్ ఓటీటీలో విడుదలైన వెంటనే ఓటీటీలో సంచలనం సృష్టించింది. దాదాపు ఏడు సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సిరీస్‌లో ఇమ్రాన్ హష్మీ నటనకు ప్రశంసలు లభించాయి. ఈ సిరీస్‌కు IMDBలో 6.7 రేటింగ్ వచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో దూసుకుపోతుంది. మనం మాట్లాడుకుంటున్న సిరీస్ పేరు ‘బార్డ్ ఆఫ్ బ్లడ్’. ఇది ప్రారంభం నుంచి చివరి వరకు మిమ్మల్ని కట్టిపడేస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

ఈ స్పై వెబ్ సిరీస్‌ను షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్థ ‘రెడ్ చిల్లీస్’ నిర్మించింది. పాకిస్థాన్ నలుగురు భారత గూఢచారులను పట్టుకున్న తర్వాత, కబీర్ తన పేరు మార్చుకుని మరో ఇద్దరితో కలిసి ఒక రహస్య మిషన్‌పై వెళ్తాడు. ఈ మిషన్ సమయంలో, అతను తన గతాన్ని మరిచిపోయి దేశాన్ని రక్షిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సిరీస్.

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

Follow Us