Cinema : ఇది కదా అసలైన ఎంటర్టైన్మెంట్.. ఈ వారం ఓటీటీలోకి టెన్షన్ పుట్టించే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు.. ప్రతి మూవీ ఓ సెన్సేషన్..

ఓటీటీలోకి వారం వారం విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ కోసం ఇప్పుడు జనాలు తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇంట్లోనే కూర్చుని ఉత్కంఠభరితమైన చిత్రాలతోపాటు సస్పెన్స్ థ్రిల్లర్, ట్విస్టులతో సాగే సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్లుగా ఈ వారం కూడా ఇంట్రెస్టింగ్ మూవీస్ ఓటీటీలోకి రాబోతున్నాయి.

Cinema : ఇది కదా అసలైన ఎంటర్టైన్మెంట్.. ఈ వారం ఓటీటీలోకి టెన్షన్ పుట్టించే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు.. ప్రతి మూవీ ఓ సెన్సేషన్..
Ott Movies

Updated on: Sep 21, 2026 | 11:29 AM

వారాంతం వచ్చిందంటే చాలు సినిమా ప్రేమికులు ఇప్పుడు ఓటీటీలలో విడుదలయ్యే సరికొత్త కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి వారం కొత్త చిత్రాలు.. అలాగే థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు విడుదలవుతున్నాయి. ఇప్పటికే పలు చిత్రాలు ట్రెండింగ్ లో దూసుకుపోతుండగా.. ఇప్పుడు మరో వారం వచ్చేసింది. ఈ క్రమంలోనే కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్ లు సైతం రిలీజ్ కానున్నాయి. ఈ వారం కూడా వివిధ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు థ్రిల్లర్లు, రొమాంటిక్ డ్రామాలు, కామెడీ షోలతో అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే స్ట్రీమింగ్‌లోకి వచ్చిన చిత్రాలతో పాటు త్వరలోనే ప్రేక్షకులను పలకరించనున్న కొత్త సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా. అలాగే ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందనే విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ (Netflix):

లస్ట్ స్టోరీస్ 3 (హిందీ): సెప్టెంబర్ 18 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ పాపులర్ ఆంథాలజీ సిరీస్. నలుగురు వేర్వేరు దర్శకులు తెరకెక్కించిన నాలుగు కథలతో మానవ సంబంధాలు, కోరికల చుట్టూ సాగే ఈ భావోద్వేగ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఇరుముడి (తెలుగు): రవితేజ, ప్రియా భవానీ శంకర్, నక్షత్ర, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కుటుంబ కథా చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. అయ్యప్ప స్వామి భక్తి నేపథ్యంతో పాటు తండ్రీకూతుళ్ల అనుబంధం, పశ్చాత్తాపం వంటి అంశాలతో రూపొందింది.

జాకీర్ ఖాన్ – పాపా యార్ (హిందీ): ప్రసిద్ధ కామిక్ జాకీర్ ఖాన్ తన చిన్ననాటి జ్ఞాపకాలు, తండ్రితో తనకున్న అనుబంధాన్ని హాస్యం , కవిత్వంతో జోడించి అందించిన స్టాండప్ షో ఇది.

ది స్కాండల్ (కొరియన్): ఫ్రెంచ్ నవల ఆధారంగా జోసోన్ కాలం నాటి ఉన్నత వర్గాల కథతో రూపొందిన చారిత్రక రొమాంటిక్ డ్రామా.

బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ (ఇంగ్లీష్): అమెరికన్ ఛాంపియన్‌షిప్ లక్ష్యంగా సాగే యువతరం నృత్య పోటీల వినోదాత్మక చిత్రం.

ప్రైమ్ వీడియో, సోనీలివ్ (Prime Video & SonyLIV):

కట్టాలన్ (మలయాళం): 1995 కేరళ-తమిళనాడు సరిహద్దుల నేపథ్యంలో దంతాల స్మగ్లింగ్ మరియు నేర సామ్రాజ్యాల మధ్య జరిగే ఘర్షణలను తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్.

జియోహాట్‌స్టార్ (JioHotstar):

తుడక్కం (మలయాళం): మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ పరిచయమవుతున్న సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్.

హుంకార్ – ది రోర్ (సెప్టెంబర్ 25): ఓ ఆధ్యాత్మిక గురువుపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణలు, దాని చుట్టూ తిరిగే కోర్టు డ్రామా నేపధ్యంలో సెప్టెంబర్ 25న విడుదల కానుంది.

జీ5 (ZEE5):

అగాధ (సెప్టెంబర్ 25): ఆధ్యాత్మిక శక్తులు ఉన్న మహిళ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చీకటి శక్తులతో చేసే పోరాటం కథాంశంగా సెప్టెంబర్ 25న ఓటీటీలోకి రానుంది.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

 

Loading...
Unable to load recommendations.
Follow Us