Rules Ranjann: ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిన రూల్స్ రంజన్.. ఎక్కడ ..? ఎప్పుడంటే..

|

Nov 29, 2023 | 5:11 PM

తన ఇమేజ్ కు సూట్ అయ్యే కథలను ఎంచుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. వరుసగా సినిమాలైతే చేస్తున్నాడు కానీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు ఈ యంగ్ టాలెంట్. ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమా తర్వాత ఆ రేంజ్ లో కిరణ్ నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేపోయాయి.

Rules Ranjann: ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిన రూల్స్ రంజన్.. ఎక్కడ ..? ఎప్పుడంటే..
Rules Ranjan
Follow us on

రాజా వారు రాణిగారు అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. సహజమైన నటనతో పక్కింటి కుర్రాడిలా ఉండే కిరణ్ అబ్బవరం తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. తన ఇమేజ్ కు సూట్ అయ్యే కథలను ఎంచుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. వరుసగా సినిమాలైతే చేస్తున్నాడు కానీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు ఈ యంగ్ టాలెంట్. ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమా తర్వాత ఆ రేంజ్ లో కిరణ్ నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేపోయాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా రూల్స్ రంజన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రత్నం కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది.

ఈ సినిమాలో కిరణ్ అబ్బవరంకు జోడీగా నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో సమ్మోహనుడా అనే సాంగ్ బాగా పాపులర్ అయ్యింది. థియేటర్స్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న రూల్స్ రంజన్ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి సిద్ధం అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థలో రూల్స్ రంజన్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఇందుకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ వచ్చింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో రూల్స్ రంజన్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు ఆహా టీమ్. నవంబర్ 30న రూల్స్ రంజన్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 30న సాయంత్రం 6 నుంచి రూల్స్ రంజన్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్స్ లో ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఎలా అలరిస్తుందో చూడలి.

ఆహా ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.