The Kerala Story: థియేటర్‌లో రిలీజైన ఇన్నాళ్లకు.. ఎట్టకేలకు ఓటీటీలోకి కేరళ స్టోరీ

బాలీవుడ్ లో గత ఏడాది రిలీజ్ అయిన ది కేరళ స్టోరీ మంచి విజయాన్ని అందుకుంది. సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది. కేరళ స్టోరీ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో.. అలాగే కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంది ఈ సినిమా. ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

The Kerala Story: థియేటర్‌లో రిలీజైన ఇన్నాళ్లకు.. ఎట్టకేలకు ఓటీటీలోకి కేరళ స్టోరీ
Kerala Story

Updated on: Feb 06, 2024 | 7:06 PM

థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలోకి చాలా కామన్.. థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు కేవలం నెలరోజుల్లో ఓటీటీలోకి వచ్చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇంకొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి. మరికొన్ని సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయి కొన్ని నెలలు అవుతున్నా ఓటీటీలోకి రావు. అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో కేరళ స్టోరీ సినిమా ఒకటి. బాలీవుడ్ లో గత ఏడాది రిలీజ్ అయిన ది కేరళ స్టోరీ మంచి విజయాన్ని అందుకుంది. సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది. కేరళ స్టోరీ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో.. అలాగే కొన్ని విమఫిబ్రవరి 16న ఫిబ్రవరి 16న ర్శలు కూడా ఎదుర్కొంది ఈ సినిమా. ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. కాంట్రవర్షల్ కంటెంట్ తో తెరకెక్కిన కాశ్మీరీ ఫైల్స్ సినిమా కూడా చాలా విమర్శలు ఎదుర్కొంది.. కానీ త్వరగానే ఓటీటీలోకి వచ్చింది ఈ సినిమా. కానీ కేరళ స్టోరీ సినిమా విడుదలై చాలా కాలం అయినా ఇప్పటివరకు ఓటీటీలోకి రాలేదు. దాంతో ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడుడెప్పుడు వస్తుందా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.

ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్  పై క్లారిటీ వచ్చింది. ఈ సినిమాని పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ కేరళ స్టోరీ సినిమాను ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ జీ 5 ఈ చిత్రాన్ని ఈ ఫిబ్రవరి 16న తీసుకొస్తున్నట్టుగా ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

అదా శర్మ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

అదా శర్మ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.