Chavu Kaburu Challaga: ఓటీటీలోకి మరో యంగ్ హీరో సినిమా.. ఆ తేదీన రానున్న ‘చావు కబురు చల్లగా’…

karthikeya : లాక్ డౌన్ తర్వాత థియేటర్లు తెరుచుకున్న తర్వాత కూడా ఓటీటీలకు ఆదరణ తగ్గడం లేదు. అటు బాక్సాఫీసు దగ్గర సూపర్ హిట్‏గా నిలిచి.. దర్శకనిర్మాతలకు

Chavu Kaburu Challaga: ఓటీటీలోకి మరో యంగ్ హీరో సినిమా.. ఆ తేదీన రానున్న చావు కబురు చల్లగా...
Chavu Kaburu Challaga

Updated on: Apr 10, 2021 | 7:13 PM

karthikeya : లాక్ డౌన్ తర్వాత థియేటర్లు తెరుచుకున్న తర్వాత కూడా ఓటీటీలకు ఆదరణ తగ్గడం లేదు. అటు బాక్సాఫీసు దగ్గర సూపర్ హిట్‏గా నిలిచి.. దర్శకనిర్మాతలకు కాసుల వర్షం కురించిన సినిమాలు మళ్లీ ఓటీటీలోనూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఈ జాబితాలోకి మరో యాంగ్ హీరో సినిమా కూడా రాబోతుంది. ఇటీవల ప్రేక్షకులను అలరించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘చావు కబురు చల్లగా’.. ఈ సినిమాలో ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ.. లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించగా.. డైరెక్టర్ కౌశిక్ తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ఏప్రిల్ 26 నుంచి స్రీమింగ్ కానుట్లుగా ఆహా సంస్థ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్ పై అల్లు అర్జున్ సమర్పణలో బన్ని వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ఆమని, మురళీశర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సినిమా విషయానికి వస్తే.. శవాలను తీసుకెళ్లే వ్యాన్ డ్రైవర్ (బస్తీ బలరాజు).. మెటర్నటీ నర్స్ (మల్లిక) భర్త శవాన్ని తీసుకురావడానికి వెళ్లి… ఆమెను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఇక తన అల్లరితో మల్లికను ఇబ్బందులు పెడుతూ ఆమె వెంటపడతాడు. ఇక మల్లిక తన భర్త ఆలోచనల నుంచి బయటకు రాలేక.. తన వెంటపడుతున్న బాలరాజుని అసహ్యించుకుంటుంది. అలాంటి మల్లిక.. బాలరాజు ప్రేమలో ఎలా పడింది? బ్రతుకు, చావు, పెళ్లి, ప్రేమ నేపథ్యంలో వీరిద్దరి మధ్య దారితీసిన పరిస్థితులు ఏంటి? అనేదే సినిమా. ఇందులో భర్తను కోల్పోయిన మహిళ పాత్రలో లావణ్య జీవించేసింది అని చెప్పుకోవాలి.

ట్వీట్..

Also Read: Celebrity Kids: ఈ స్టార్ హీరోల పిల్లలను ఎప్పుడైనా చూశారా ? ఎంత క్యూట్‏ క్యూట్‏గా ఉన్నారో చూడండి..

Tamannah: మిల్కీబ్యూటీ తమన్నా ధరించే డ్రెస్సుల ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..