ఇటీవల సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్ మూవీస్‌కు ఆదరణ బాగా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా ఓటీటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి సినిమాలు పెద్ద ఎత్తున విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ‘ఐరావతం’ చిత్రం. సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్‌తో తెరకెక్కిన ఈ సినిమా డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎస్తేర్ నోహ, అమర్ దీప్, తన్వీ నేగి, అరుణ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి సుహాస్ దర్శకత్వం వహించారు.
నవంబర్ 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ మొదలైన ఈ సినిమా ప్రేక్షకులకు తెగ ఆకట్టుకుంటోంది. ఐరావతం మూవీకి అనూహ్య స్పందన వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా మొదటి స్థానంలో స్ట్రీమింగ్ అవుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఎస్తేర్ నొర్హానా, అమీర్ దీప్ పాత్రలకు మంచి రెస్పాన్స్ లభిస్తుందని తెలిపిన చిత్ర యూనిట్, వైట్ కెమెరా నేపథ్యంగా సాగే కథ మంచి ఎంగేజింగ్‌గా ఉందని తెలిపారు. ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌పై నిర్మాతలు మాట్లాడుతూ.. ‘ఐరావతం కథను దర్శకుడు సుహాస్ చెబితే మాకు బాగా నచ్చింది. ఈ కథలోని స్క్రీన్ ప్లే నచ్చి మూవీ తీద్దాం అనుకున్నాం. ఈ మూవీ డిస్నీ+ హాట్‌స్టార్‌కు నచ్చి తీసుకోవడంతో హ్యాపీగా ఫీలయ్యాం. గత రెండు వారాలుగా టాప్ ప్లేస్‌లో స్ట్రీమింగ్ అవుతుంది’ అని చెప్పుకొచ్చారు.
సైకో కిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో రూపొందించారు. వైట్ కెమెరా చుట్టూ కథను అల్లిన తీరు ఆకట్టుకుంటోంది. నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం హిట్ టాక్‌తో ఓటీటీలో దుమ్మురేపుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..