ఓటీటీలోకి వచ్చేసిన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌.. ఎక్కడ చూడొచ్చంటే

తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సిఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ అందిస్తూ ఓటీటీ రంగంలో జెట్ స్పీడ్ లో ఆహా దూసుకుపోతుంది. చిన్నారులు, పెద్దలు ఇష్టపడే కంటెంట్ చిత్రాలను అందించడంతో పాటు ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను తెలుగులోకి డబ్ చేసి మరీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తోంది.

ఓటీటీలోకి వచ్చేసిన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌.. ఎక్కడ చూడొచ్చంటే
Ott Movie

Updated on: Dec 05, 2025 | 11:06 PM

డిజిటల్‌ రంగంలో 100 శాతం వినోదాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా . ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్ని సూపర్‌హిట్‌ సినిమాలు, థ్రిల్లింగ్ సస్పెన్స్ వెబ్ సిరీస్‏లను సినీ ప్రియులకు అందించింది. అలాగే అన్‌స్టాపబుల్‌ అంటూ టాక్‌షోలు, తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సింగర్‌ సింగింగ్‌ షోలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అదిరిపోయే వెబ్ సిరీస్ లను అందించింది ఆహా. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ఆహాలో ఇప్పటికే ఎన్నో రకాల వెబ్ సిరీస్ టాప్ లో దూసుకుపోతున్నాయి. తాజాగా ఓ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అందుబాటులోకి వచ్చింది.

ఆ సిరీస్ మరేదో కాదు ధూల్ పేట్ పోలీస్ స్టేషన్. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సిరీస్ పై అభిమానుల్లో ఆసక్తి పెంచేశాయి. నేటి నుంచి ఈ సిరీస్ ప్రేక్షకులకు ఆహాలో అందుబాటులోకి వచ్చింది. ఇంట్రెస్టింగ్ స్టోరీతో ఈ సిరీస్ తెరకెక్కిందని అంటున్నారు.

తమిళ  యాక్టర్స్ అశ్విన్‌, శ్రీతు కృష్ణన్‌, గురు ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ కు జస్విని దర్శకత్వం వహించారు. ఆసక్తికరమైన ఈ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌.. ఈ శుక్రవారం( నేటి నుంచి) తెలుగు, తమిళంలో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అలానే ప్రతి శుక్రవారం రాత్రి 7 గంటలకు కొత్త ఎపిసోడ్‌ రిలీజ్‌ అవుతుంది. ఈ క్రమంలో నేడు ( శుక్రవారం) ఓ ఎపిసోడ్ ను రిలీజ్ చేశారు. ఇక ధూల్ పేట్ అనే ఊరిలో ఓ రోజు రాత్రి మూడు హత్యలు జరుగుతాయి. వీటిని దర్యాప్తు చేసేందుకు ఓ ఏసీపీని అపాయింట్ చేస్తారు. అతను నేరస్థులను పట్టుకోలేకపోతాడు. దీంతో మరో ఏసీపీని కూడా కేసుని దర్యాప్తు చేసేందుకు నియమిస్తారు. తర్వాత ఏమైంది? అసలు ఆ హత్యలు చేసింది ఎవరు.? ఎందుకు అనేది సిరీస్ లో చూడాల్సిందే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.