ఓటీటీల్లో రకరకాల వెబ్ సిరీర్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సూపర్ హిట్ సినిమాలే కాదు వెబ్ సిరీస్లు కూడా ప్రేక్షకులను మెప్పిస్తూ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. అలాంటి సిరీర్ ల్లో సేవ్ ది టైగర్స్ ఒకటి. టైటిల్ కొత్తగా ఉన్నా కాన్సెప్ట్ మాత్రం హిలేరియస్ గా ఉంటుంది. భార్య భర్తల మధ్య జరిగే మిస్ అండర్ స్టాండింగ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ సిరీస్ హాట్‌స్టార్ స్పెషల్స్ బ్యానర్‌పై మహి వి. రాఘవ్, చిన్నా వాసుదేవరెడ్డి నిర్మించారు. అలాగే తేజ కాకుమాను దర్శకత్వం వహించాడు. . ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక వీరి భార్యాల పాత్రల్లో జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవియని నటించారు.
అయితే వీరిలో పావని గంగిరెడ్డి గురించి మీకు తెలుసా..? ఈ అమ్మడు ఇంతకు ముందు ఏ ఏ సినిమాల్లో చేసిందో తెలుసా.. పావని 2015లో వచ్చిన మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది. అంతకు ముందు ఓ షార్ట్ ఫిలిం లో నటించింది. వింద్యామారుతం అనే షార్ట్ ఫిలిమ్ లో చేసింది ఈ చిన్నది.
ఆ తర్వాత సైజ్ జీరో, బ్రహ్మోత్సవం, రైట్ రైట్, జో అచ్చుతానంద, అంతరిక్షం, మీకు మాత్రమే చెప్తా సినిమాల్లో నటించింది. ఇక 2019లో ఎక్కడికి ఈ పరుగు అనే వెబ్ సిరీస్ చేసింది. రీసెట్ గా సేవ్ ది టైగర్ లో చేసింది . ఇంజనీరింగ్ పూర్తిచేసిన పావని, ఇన్ఫోసిస్ టెక్నాలజీ హెడ్ గా పనిచేసింది. సినిమాల పై మక్కువతో ఆమె ఈ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడు నటిగా మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది.