
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బైసన్. మారి సెల్వరాజ్ తెరకెక్కంచిన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. అలాగే రజిషా విజయన్, పశుపతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో తెలుగులోనూ ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఓ వారం రోజుల గ్యాప్ తర్వాత అంటే అక్టోబర్ 24న తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదలైన బైసన్ కు పాజిటివ్ టాక్ వచ్చింది. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి .అలాగే ధ్రువ్ విక్రమ్ నటనకు కూడా కాంప్లిమెంట్స్ లభించాయి. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కించిన బైసన్ సినిమా సుమారు రూ. 60 కోట్లకు పైగానే కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికీ తమిళనాడులో చాలా చోట్ల ఈ సినిమా థియేటర్లలో మంచి కలెక్షన్లతో ఆడుతోంది. అదే సమయంలో చాలా మంది ఓటీటీలోనూ ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాను చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే వీరి నిరీక్షణకు తెరపడనుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరలవుతోంది.
బైసన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నవంబర్ 21 నుంచి ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. అంటే వచ్చేవారమే నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కావొచ్చని తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్ మాత్రమే. మరో రెండు మూడు రోజుల్లో బైసన్ సినిమా ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన వెలువడవచ్చు.
దర్శకుడు పా.రంజిత్‌కు చెందిన నీలం ప్రొడక్షన్‌న్స్, అప్లాజ్ ఎంటర్‌టెయిన్‌మెంట్, శాంతి సినిమా సంస్థలు కలిసి బైసన్ సినిమాను నిర్మించాయి. నివాస్ కే.ప్రసన్న సంగీతాన్ని అందించారు. ఒక గ్రామానికి చెందిన పేద కుర్రాడు అత్యున్నత పురస్కారం అర్జున్ అవార్డును గెలుచుకునే స్థాయికి ఎలా ఎదిగాడు అనే ఇతివృత్తంతో తెరకెక్కిన బైసన్ సినిమా తెరకెక్కింది.
#BisonKaalamaadan is expected to be streaming on November 21 in #Netflix !#SaiSango #TAMILTVHouse #DhruvVikram #Pasupathy #AnupamaParameswaran #BisonKaalamaadanOnNetflix pic.twitter.com/QxFLAk6e7x
— TAMIL TV House (@tamiltvhouse) November 10, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.