ఇప్పటికే ఓటీటీలో చాలా సినిమా ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయిన నెలరోజులకు ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. థియేటర్స్ లో సినిమాలను ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఓటీటీలోనూ సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. బడా హీరోల సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా ఓటీటీలో రిలీజై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటుకే చాలా సినిమాలు ఓటీటీలో అలరిస్తున్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఓ నిజ జీవిత కథ ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఓ ఇంట్రెస్టింట్ క్రైం థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలోకివచ్చింది.
ఆ సినిమానే కర్రీ అండ్ సైనైడ్.. ఇది ఓ రియల్ ఇన్సిడెంట్ కు సంబంధించిన కథ. నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ఓ మహిళ పద్నాలుగేళ్లలో ఆరు హత్యలు చేసింది. ఈ దారుణమైన సంఘటన కేరళ లో జరిగింది. ఓ మహిళ తన కుటుంబసభ్యులనే హతమార్చింది. జూలీ జోసెఫ్ అనే మహిళ తెలివిగా ఆరుగురిని చంపేసింది.
అన్నింటిని అనుమానాస్పద మృతులుగా కట్టుకథలు అల్లింది. జూలీ జోసెఫ్ తన అత్తయ్యను, మామయ్యను, ఆతర్వాత ఆమె భర్త రాయ్ థామస్, ఆతర్వాత తన అత్తయ్య సోదరుడు మాథ్యూ, తన భర్త దగ్గరి బంధువైన షాజు జచారయ్య భార్య, ఏడాదిన్నర బిడ్డను చంపేసింది . ఆతర్వాత షాజు జచారయ్యను రెండో వివాహం చేసుకుంది. అయితే జూలీ జోసెఫ్ భర్త సోదరుడు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. దాంతో చాలా విషయాలు బయట పడ్డాయి. ఆస్తి తనకు దక్కాలన్న అత్యాశతోనే అందరిని చంపిన జూలీ జోసెఫ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.