Boys Hostel OTT: ఓటీటీలోకి రాబోతున్న కామెడీ ఎంటర్టైనర్.. ‘బాయ్స్ హాస్టల్’ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..

కన్నడలో ఘనవిజయం సాధించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'హాస్టల్ హుడుగారు బేకగిద్దరే' చిత్రం తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. డైరెక్టర్ నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రజ్వల్, మంజునాథ్ నాయక, రాకేశ్ రాజ్ కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ప్రధాన పాత్రలు పోషించారు. రిషబ్ శెట్టి, రష్మీ గౌతమ్, తరుణ్ భాస్కర్ అతిథి పాత్రలలో మెరిశారు. ఆగస్ట్ 26న విడుదలైన ఈ సినిమా తెలుగు యువతను ఆకట్టుకుంది

Boys Hostel OTT: ఓటీటీలోకి రాబోతున్న కామెడీ ఎంటర్టైనర్.. బాయ్స్ హాస్టల్ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..
Boys Hostel

Updated on: Nov 03, 2023 | 8:56 PM

ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన చిత్రాలు ఇప్పుడు తెలుగులోకి డబ్ అవుతున్న సంగతి తెలిసిందే. కాంతార, గుడ్ నైట్, మట్టి కుస్తీ, జయ జయ జయహే చిత్రాలు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకున్నాయి. అలాగే కన్నడలో ఘనవిజయం సాధించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’ చిత్రం తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. డైరెక్టర్ నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రజ్వల్, మంజునాథ్ నాయక, రాకేశ్ రాజ్ కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ప్రధాన పాత్రలు పోషించారు. రిషబ్ శెట్టి, రష్మీ గౌతమ్, తరుణ్ భాస్కర్ అతిథి పాత్రలలో మెరిశారు. ఆగస్ట్ 26న విడుదలైన ఈ సినిమా తెలుగు యువతను ఆకట్టుకుంది. ఇప్పటికే కన్నడ వెర్షన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. తెలుగు వెర్షన్ ఎప్పుడెప్పుడు వస్తుందా ?.. అని ఎదురుచూస్తు్న్నారు.

తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. దీపావళీ కానుకగా నవంబర్ 10న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఈటీవీ విన్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేశాయి. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్‏గా తెరకెక్కిన ఈ సినిమా ఆకట్టుకుంది.

ఈ సినిమాకు విరూపాక్ష ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు. హాస్టల్ వార్డెన్ సూసైడ్ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హాస్టల్ వార్డెన్ అనుమానాస్పద స్థితిలో చనిపోవడం..అతని వద్దే కొందరు స్టూడెంట్స్ పేర్లు రాసి ఉన్న సూసైడ్ లెటర్ దొరుకుతుంది. ఇంతకీ ఆ లెటర్ ఏం రాసి ఉంది ?.. హాస్టల్ వార్డెన్ మరణం వెనక ఎవరున్నారు ?.. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అలరించనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.