Aa Okkati Adakku OTT: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు.. స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే..

ఇప్పుడు తన మార్క్ కామెడీతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు. మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాజీవ్ చిలక నిర్మించారు. ఇందులో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించగా.. వెన్నెల కిశోర్, వైవా హర్ష కీలకపాత్రలు పోషించారు. మే 3న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. కానీ ఆశించిన స్థాయిలో కమర్షియల్ హిట్ కాలేకపోయింది. కామెడీ పరంగా అలరించినా.. అంతగా వసూళ్లు రాబట్టలేకపోయింది.

Aa Okkati Adakku OTT: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు.. స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే..
Aa Okkati Adakku

Updated on: May 31, 2024 | 9:07 AM

చాలా కాలం తర్వాత హీరో అల్లరి నరేష్ నటించిన కామెడీ ఎంటర్టైనర్ ఆ ఒక్కటి అడక్కు. ఒకప్పుడు కామెడీ కథలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నరేశ్.. ఆ తర్వాత విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నారు. సీరియస్ యాక్షన్ సినిమాలు.. వైవిధ్యమైన కంటెంట్ కథలను సెలక్ట్ చేసుకుంటూ నటుడిగా ప్రశంసలు అందుకున్నారు. ఇట్లు మారెడుపల్లి ప్రజానీకం, ఉగ్రం, నాంది వంటి యాక్షన్ చిత్రాలతో అలరించాడు నరేశ్. ఇక ఇప్పుడు తన మార్క్ కామెడీతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు. మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాజీవ్ చిలక నిర్మించారు. ఇందులో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించగా.. వెన్నెల కిశోర్, వైవా హర్ష కీలకపాత్రలు పోషించారు. మే 3న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. కానీ ఆశించిన స్థాయిలో కమర్షియల్ హిట్ కాలేకపోయింది. కామెడీ పరంగా అలరించినా.. అంతగా వసూళ్లు రాబట్టలేకపోయింది.

అటు థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆ ఒక్కటి అడక్కు సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇన్నాళ్లు థియేటర్లలో మిస్ అయినవారు ఇప్పుడు ఈ కామెడీ సినిమాను ఇంట్లో చూసి ఎంజాయ్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ సినిమా కేవలం తెలుగు భాషలోనే అందుబాటులో ఉంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మూవీ ఇప్పుడు నెల రోజులు కాకముందే ఓటీటీలో ఏ రేంజ్ రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

చిలక ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే వయసు పెరిగిన అబ్బాయి పెళ్లి కోసం పడే తంటాలను ఈ చిత్రంలో చూపించారు. పెళ్లి చేసుకోవడానికి హీరో పడే కష్టాలు, మాట్రిమొని సైట్స్ ను కలవడం.. అందులో వారు చేసే మోసాలను కళ్లను కట్టినట్లుగా చూపించారు. ఇక ఇందులో మరోసారి తన నటనతో ఆకట్టుకుంది ఫరియా అబ్దుల్లా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.