Balakrishna Unstoppable: ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతోన్న అన్‌స్టాపబుల్ టాక్ షోతో నట సింహం బాలకృష్ణ తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. బాలకృష్ణ అంటే ఎప్పుడూ కోపంగా ఉంటారని అభిప్రాయపడేవారి ఆలోచనలను తలకిందులు చేస్తూ.. తనలోని హ్యూమర్‌ను పంచుతున్నారు బాలయ్య. టాక్‌షోకు హాజరైన సెలబ్రిటీలను ఓవైపు ఇరుకున పెట్టే ప్రశ్నలు సంధిస్తూనే మరోవైపు చిలిపి ప్రశ్నలతో ఫన్‌ను పంచుతున్నారు. ఇప్పటి వరకు ప్రసారమైన 6 ఎపిసోడ్‌లు అద్భుతమైన టాక్‌ను సంపాదించుకోగా తాజాగా మరో ఎపిసోడ్‌తో డిజిటల్ ప్రేక్షకులను ఆకట్టుకోడానికి సిద్ధమయ్యారు.
7వ ఎపిసోడ్‌లో భాగంగా షోలో మాస్ మహా రాజ రవితేజ హాజరయ్యారు. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఆహా టీమ్ విడుదల చేసింది. ప్రోమో మొత్తం సందడిగా సాగింది. ఎపిసోడ్ మొదట్లో బాలయ్య మాట్లాడుతూ.. ‘నీకు నాకు పెద్ద గొడవ అయ్యిందటగా ముందు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వు’ అని అడగ్గా.. దానికి రవితేజ స్పందిస్తూ.. ‘పనీపాట లేని డ్యాష్‌గాల్లకు ఇదే పని’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ షోలో రవితేజతో పాటు దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా పాల్గొన్నారు. గోపీచంద్‌పై కూడా బాలయ్య కొన్ని ఫన్నీ ప్రశ్నలు సంధించారు.
ఇక రవితేజపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై కూడా ప్రశ్నించారు బాలయ్య. ‘హెల్త్‌కు, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే నీ మీద డ్రగ్స్ కేసు పెట్టారు’ అని అడగగా.. రవితేజ బదులిస్తూ.. ‘మొదట నాకే ఆశ్చర్యమేసింది. బాధ ఎక్కడ పడ్డానంటే.. పెంట పెంట చేశారు. అది కొంచెం బాధేసింది’ అని మనసులో మాటను బయటపెట్టారు రవితేజ. మరి ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ప్రోమోపై మీరూ ఓ లక్కేయండి..
Also Read: Rajamouli: పవన్, మహేష్, దిల్‌రాజుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన జక్కన్న.. ఎందుకో తెలుసా.?
Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 497, నిఫ్టీ 157 పాయింట్ల వృద్ధి..