Sarkaar Season 5: సుడిగాలి సుధీర్ సర్కార్ గేమ్ షో సక్సెస్ పార్టీ.. ప్రోమో చూశారా..?

Updated on: Aug 13, 2025 | 7:29 PM

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సినీప్రియులను ఆకట్టుకునేందుకు ఎన్నో గేమ్ షోస్, సింగింగ్ షో తీసుకువచ్చింది. ఇతర భాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులోకి డబ్ చేసి విడుదల చేసింది. ప్రస్తుతం ఆహాలో విజయవంతంగా దూసుకుపోతున్న గేమ్ షో సర్కార్ సీజన్ 5. ఈ షోకు సుడిగాలి సుధీర్ హోస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సుడిగాలి సుధీర్ హోస్టింగ్ చేస్తున్న షో సర్కార్ సీజన్ 5. ఇప్పటివరకు ఈ షో విజయవంతంగా స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే. ఆహాలో సక్సెస్ అయిన షోలలో సర్కార్ ఒకటి. . సెలబ్రిటీలతో క్విజ్ లాంటి గేమ్ కాన్సెప్ట్ తో సాగే ఈ షో ఎప్పటిలాగే తనదైన కామెడీ టైమింగ్, సెలబ్రెటీల సందడితో ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఈ షోకు మొదటి నుంచి టాప్ రేటింగ్స్ వచ్చాయి. సర్కార్ మొదటి మూడు సీజన్స్ ప్రదీప్ మాచిరాజు యాంకరింగ్ చేయగా.. నాలుగో సీజన్ నుంచి సుడిగాలి సుధీర్ ఫుల్ జోష్ తో హోస్టింగ్ చేస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు సీజన్స్ కంప్లీట్ అయిన ఈ షో.. ఇప్పుడు సీజన్ 5 సైతం విజయవంతంగా పూర్తైంది. జూన్ 6 నుంచి ప్రారంభమైన ఈ షోకు ఇప్పిటవరకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ షో సక్సెస్ పార్టీ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది.

Published on: Aug 13, 2025 07:28 PM