
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సూపర్ హిట్ సినిమాలను అందిస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రకరకాల టీవీ షోలతో పాటు ఆకట్టుకునే వెబ్ సిరీస్‌లు.. అలరిస్తున్న టాక్ షోలతో ప్రేక్షకులను అలరిస్తోంది ఆహా. ఎన్నో అద్భుతమైన సినిమాలు, సిరీస్ లు ఆకట్టుకుంటూ దూసుకుపోతోన్న ఆహా. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీరియడ్ డ్రామా బాలు గాని టాకీస్‌ను సెప్టెంబర్ 13, 2024న ఆహా ప్లాట్‌ఫారమ్‌లో విడుదల కానుంది. ఈమేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.
పాపులర్ రియాలిటీ షో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో ప్రత్యేక సెగ్మెంట్ సందర్భంగా బాలు గని టాకీస్ సినిమా విడుదల తేదీని వెల్లడించారు. సీనియర్ నటుడు రఘు కుంచె, దర్శకుడు విశ్వనాథన్ ప్రతాప్, శరణ్యతో సహా బాలు గాని టాకీస్ మూవీ టీమ్ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ సింగింగ్ షోలో నేచురల్ స్టార్ నాని ఉండటం మూవీ టీమ్ లో ఉత్సాహం రెట్టింపైంది. నటుడు రఘు కుంచె మాట్లాడుతూ.. ఇటువంటి పాపులర్ రియాలిటీ షోలో బాలు గాని టాకీస్ ప్రీమియర్ తేదీని ప్రకటించడం థ్రిల్‌గా ఉందని అన్నారు రఘు కుంచె.
నందమూరి బాలకృష్ణ వీరాభిమాని అయిన బాలు తన థియేటర్‌లో బాలకృష్ణ చిత్రాన్ని ఎలాగైనా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు మోషన్ పోస్టర్ చూస్తే అర్ధమవుతోంది. ఈమేరకు అతను తన స్నేహితుడుతో సవాలు చేస్తాడు.ఒక్క బాలకృష్ణ సినిమాను థియేటర్‌లో రిలీజ్ చేయడం అనేది చాలా కష్టం అని బాలు స్నేహితుడు అంటాడు. కానీ బాలయ్య బాబు సినిమా రిలీజ్ చేసి తీరుతా అని బాలు సవాల్ చేస్తాడు. మరి బాలు బాలయ్య సినిమాను తన థియేటర్‌లో రిలీజ్ చేశాడా.? అసలు సినిమాను ఎలా రిలీజ్ చేశాడు.? ఎన్ని కష్టాలు పడ్డాడు అన్నది చూడాలి.
పాతకాలపు థియేటర్ నడుపుతున్న బాలు అనే యువకుడి కథతో బాలుగాని టాకీస్ అనే సినిమా ఉండనుంది. పోస్టర్‌లో “జై బాలయ్య” అనే పదాన్ని కూడా మనం చూడోచ్చు. ఇందులో బాలకృష్ణపై బాలుకి ఉన్న అభిమానాన్ని చూపించనున్నారు. అలాగే ఈ సినిమాలో బాలకృష్ణ ప్రాముఖ్యతను హైలైట్ చేయనున్నారు. ఒక ఊరిలో అడల్ట్ సినిమాలను ప్రదర్శించడం వల్ల ఆ థియేటర్ పేరు పోతుంది. అలాగే అక్కడ గ్రామస్థుల నుంచి డబ్బు తీసుకుంటాడు. ఆ అప్పులను తీరుస్తూ.. థియేటర్‌ని నిలబెట్టుకోవడానికి బాలు కష్టపడుతూ ఉంటాడు. ఎలాగైనా థియేటర్ ను బాగు చేసి అందులో బాలకృష్ణ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటాడు. ఈ క్రమంలో అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు అనేది ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమా స్మరన్ సంగీతం అందిస్తున్నారు. ఆహా ఒరిజినల్ ఫిల్మ్ బాలు గాని టాకీస్ చూడటానికి సెప్టెంబర్ 13వరకు ఆగాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..