దసరా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటేస్ట్ సినిమా ‘హాయ్ నాన్న’. కొత్త డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నానికి జోడిగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటించింది. తండ్రికూతురు బంధం నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో మరోసారి ఫాదర్ పాత్రలో ఒదిగిపోయాడు నాని. అలాగే ఈ సినిమాలో నాని కూతురిగా చైల్డ్ ఆర్టిస్ట్ కియారా ఖన్నా కనిపించింది. డిసెంబర్ 7న విడుదలైన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. తండ్రికూతురి అనుబంధం.. అందమైన ప్రేమకథతో ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించాడు డైరెక్టర్ శౌర్యువ్. ఈ సినిమాకు అభిమానులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. నాని, మృణాల్, కియారా నటనకు.. హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతానికి అడియన్స్ ఫిదా అయిపోయారు. సెంటిమెంట్ ఎమోషనల్ డ్రామాతో అడియన్స్ మనసులకు హత్తుకున్నారు నాని. ఇప్పటివరకు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
‘హాయ్ నాన్న’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని జనవరి 4 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. ముందుగా అనౌన్స్ చేసినట్లే జనవరి 4 అర్ధరాత్రి నుంచి ‘హాయ్ నాన్న’ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రాన్ని చూడొచ్చు. మరి ఇంకేందుకు ఆలస్యం.. ఇన్నాళ్లు థియేటర్లలో మిస్ అయిన సూపర్ హిట్ చిత్రాన్ని ఇప్పుడు ఇంట్లోనే చూసేయ్యండి.
We can’t wait to say Hi to Viraj, Yashna and Mahi tomorrow! 👋🥰#HiNanna streaming from tomorrow on Netflix in Telugu, Tamil, Malayalam, Kannada, & Hindi. pic.twitter.com/m2kiRJxA66
— Netflix India South (@Netflix_INSouth) January 3, 2024
‘హాయ్ నాన్న’ సినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి నిర్మించారు. ఇందులో నటుడు జయరాం, ఒకప్పటి హీరోయిన్ మీరా జాస్మిన్ కీలకపాత్రలు పోషించారు. కంటెంట్ తోపాటు, మ్యూజిక్ పరంగానూ ‘హాయ్ నాన్న’ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలోని ప్రతి సాంగ్ శ్రోతలకు తెగ నచ్చేసింది. ప్రస్తుతం నాని సరిపోదా శనివారం చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై క్యూరియాసిటిని కలిగిస్తున్నాయి.
Dressing up to see the love of our lives (Hint: It’s Nani) 🥰#HiNanna, coming to Netflix on 4th Jan in Tamil, Malayalam, Kannada, Telugu & Hindi. pic.twitter.com/2DOdAzdcla
— Netflix India South (@Netflix_INSouth) January 1, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.