Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ సెమీ ఫైనల్లో బాలయ్య సందడి.. ఆన్‏స్టాపబుల్ టాప్ 6 కంటెస్టెంట్స్ ఎవరంటే..

|

May 30, 2022 | 7:03 AM

అన్నపూర్ణ స్టూడియోలో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షో షూటింగ్ నిర్వహిస్తుండగా.. మార్చి 29న ఆదివారం ఈ షో సెమి ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ జరిగింది.

Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ సెమీ ఫైనల్లో బాలయ్య సందడి.. ఆన్‏స్టాపబుల్ టాప్ 6 కంటెస్టెంట్స్ ఎవరంటే..
Telugu Indian Idol
Follow us on

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ షో తుది అంకానికి చేరుకోబోతుంది. ఆరుగురు కంటెస్టెంట్స్ ఫినాలేకు చేరుకున్నారు (Telugu Indian Idol). శ్రీనివాస్, జయంత్, వాగ్దేవి, ప్రణతి, లాలస, వైష్ణవి కంటెస్టెంట్స్ సెమి ఫినాలేకు చేరుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షో షూటింగ్ నిర్వహిస్తుండగా.. మార్చి 29న ఆదివారం ఈ షో సెమి ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. తెలుగు ఇండియన్ ఐడల్ సెమీ ఫైనల్స్ కి చీఫ్ గెస్ట్ గా నందమూరి బాలకృష్ణ హజరయ్యారు. నందమూరి తారకరామారావు శతజయంతి ప్రారంభోత్సవం సందర్భంగా తెలుగు ఇండియన్ ఐడల్ సెమి ఫినాలే ఎపిసోడ్ లో సీనియర్ ఎన్టీఆర్ పాటలను పాడారు. ఆహా ఇండియన్ ఐడల్ తెలుగు షో సెమి ఫినాలేకు చీఫ్ గెస్ట్ గా వచ్చిన బాలకృష్ణ మాట్లాడుతూ.. అహా వాళ్ళు మొదటిసారి తెలుగులో ఇండియన్ ఐడల్ చేస్తున్నారు. నేను ఖాళీగా ఉన్నప్పుడు ఈ షో చూస్తూ ఉంటాను. కంటెస్టెంట్స్ బాగా పాడుతున్నారు. సెమీ ఫైనల్ కదా కొంత మంది షివరింగ్ లో వున్నారు సెట్ చేద్దామని వచ్చాను. బాగా పాడిన వాళ్లకు ఓటు వేసి గెలిపించండి అన్నారు..

తెలుగు ఇండియన్ ఐడల్ షోలో సెమి ఫినాలేకు చేరుకోవడం పట్ల టాప్ 6 కంటెస్టెంట్స్ గా నిలిచిన శ్రీనివాస్, జయంత్, వాగ్దేవి, ప్రణతి, లాలస, వైష్ణవి సంతోషం వ్యక్తం చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న ఈ ఎపిసోడ్ కు సింగర్ శ్రీరామ్ హోస్ట్ గా వ్యవహరించగా.. తమన్, కార్తీక్, నిత్యామీనన్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ ఓటింగ్ ఎపిసోడ్ కు గెస్ట్ గా మూడు దశాబ్దాల పాటు తన గాత్రంతో యువతను ఊపేసిన ఊషా ఊతప్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు.