My Dear Donga: ఆహాలో కామెడీ ఎంటర్టైనర్.. “మై డియర్ దొంగ” ట్రైలర్ విడుదల.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

|

Apr 18, 2024 | 8:33 PM

రొమాన్స్, కామెడీ ఇలా అన్ని అంశాలతో తెరకెక్కించిన ఈ మూవీ ట్రైలర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్‌లో, అభినవ్ గోమటం అల్లరి చేష్టలు, కామెడీ టైమింగ్ అందరినీ నవ్విస్తుంది. దొంగతో లవ్ స్టోరీనా?.. లవ్ స్టోరీలో దొంగ అనే డైలాగ్‌తో ట్రైలర్ ఆరంభం అయింది. దొంగతో స్నేహం, ప్రేమ చివరకు వీరిద్దరి కథ ఎలా సుఖాంతం అవుతుందనే కాన్సెప్ట్‌తో మై డియర్ దొంగను తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది.

My Dear Donga: ఆహాలో కామెడీ ఎంటర్టైనర్.. మై డియర్ దొంగ ట్రైలర్ విడుదల.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
My Dear Donga
Follow us on

తెలుగు సినీ ప్రియుల కోసం కొత్త సినిమాలు.. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‏లు తీసుకువస్తుంది ఆహా ఓటీటీ. ఇప్పటికే అనేక కొత్త చిత్రాలు.. ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‏లు అందిస్తున్న తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా.. ఇప్పుడు మరో కొత్త సినిమాను తీసుకువస్తుంది. అదే మై డియర్ దొంగ. సరికొత్త కాన్సెప్ట్‏తో ఈ సినిమాను డైరెక్టర్ బిఎస్ సర్వజ్ఞ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో అభినవ్ గోమటం, షాలిని కొండేపూడి, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలలో నటించారు. CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆహా ఈ మూవీని నిర్మించింది. ఈసినిమాను ఏప్రిల్ 19 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా ప్రకటించింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా గురువారం మై డియర్ దొంగ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

రొమాన్స్, కామెడీ ఇలా అన్ని అంశాలతో తెరకెక్కించిన ఈ మూవీ ట్రైలర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్‌లో, అభినవ్ గోమటం అల్లరి చేష్టలు, కామెడీ టైమింగ్ అందరినీ నవ్విస్తుంది. దొంగతో లవ్ స్టోరీనా?.. లవ్ స్టోరీలో దొంగ అనే డైలాగ్‌తో ట్రైలర్ ఆరంభం అయింది. దొంగతో స్నేహం, ప్రేమ చివరకు వీరిద్దరి కథ ఎలా సుఖాంతం అవుతుందనే కాన్సెప్ట్‌తో మై డియర్ దొంగను తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. దొంగ దొంగతనం చేస్తూ ఓ అమ్మాయికి దొరికితే అతడి కష్టాలు ఆ అమ్మాయికి చెప్పడం.. ఆ తర్వాత వారిద్దరి మధ్య స్నేహం.. దొంగగా అతడు ఎందుకు మారాల్సి వచ్చింది ? అనే విషయాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. వీరిద్దరి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ? అనే అంశాలతో ఈ మూవీని రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విడుదలైన ట్రైలర్ మాత్రం వినోదభరితంగా, యూత్‌కు బాగా నచ్చేలా ఉంది.

ఈ సినిమాను షాలిని కొండేపూడి రచించారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అభినవ్ గోమఠం మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2014 జగన్నాటకం సినిమాలో దొంగ పాత్రలో నటించగా.. ఇప్పుడు పదేళ్ల తర్వాత మళ్లీ దొంగ పాత్రతో రాబోతున్నాడు. మై డియర్ దొంగ ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నటుడు ప్రియదర్శి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ చిత్రం ఏప్రిల్ 19 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.