
ప్రతివారం పదుల సంఖ్యలో ఓటీటీల్లో సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే ఓటీటీల్లోనూ భారీ గా సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు ట్రెండ్ అవుతున్నాయి కూడా.. ఇక ఈవారం కూడా భారీగా సినిమాలు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ శుక్రవారం క్రేజీ సినిమాలు విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈవారం విడుదలవుతున్న సినిమాల్లో ఈ 7 సినిమాలు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. వాటిలో ఏ ఏ సినిమాలు ఉన్నాయంటే..
1. అగధ ( జీ 5)
సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ‘అగధ’ మంచి ఛాయిస్. ఎమ్.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల కీలక పాత్రలో నటించారు. ఒక అనుమానాస్పద మరణం చుట్టూ మొదలయ్యే కథ.. ఆ తర్వాత అడవిలోని ఓ రహస్య గుహ వరకు వెళ్లడంతో మరింత ఉత్కంఠగా మారుతుంది. అక్కడ హీరోయిన్ కు ఎదురయ్యే వింత అనుభవాలు, దాగి ఉన్న రహస్యాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సినిమా జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది.
2. రంభ ఊర్వశి మేనక ( అమెజాన్ ప్రైమ్ )
అల్లరి నరేష్ కామెడీ టైమింగ్‌ను ఆస్వాదించే ప్రేక్షకులకు రంభ ఊర్వశి మేనక మంచి ఎంటర్‌టైనర్. సోషియో ఫాంటసీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో దేవలోకానికి చెందిన రంభ, ఊర్వశి, మేనకలతో ఓ సాధారణ వ్యక్తి అనుకోకుండా చిక్కుల్లో పడతాడు. దేవలోకంలో జరిగిన ఓ చిన్న పొరపాటు భూలోకంలో ఎలాంటి గందరగోళానికి దారితీసిందనే అంశాన్నికామెడీగా చూపించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
3. మ్యాంగో పచ్చ – (జియో హాట్ స్టార్ )
కన్నడ హీరో సంచిత్ సంజీవ్ నటించిన యాక్షన్ డ్రామా మ్యాంగో పచ్చ కూడా ఓటీటీలోకి వచ్చేసింది. వివేక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మైసూర్ నేపథ్యంగా సాగుతుంది. తండ్రి మరణం తర్వాత కుటుంబానికి సంబంధించిన కొన్ని రహస్యాలను తెలుసుకునే క్రమంలో ఓ సీడీ షాప్ యజమాని నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాల్సి వస్తుంది. అక్కడ ఎదురయ్యే పరిణామాలు కథను ఆసక్తికరంగా మలుపుతిప్పుతాయి. ఈ మూవీ జియో హాట్ స్టార్ లో తెలుగు సహా కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
4. హుంకార్: ది రోర్ – (జియో హాట్ స్టార్)
సీరియస్ ఇన్వెస్టిగేటివ్ డ్రామాలను ఇష్టపడేవారికి హుంకార్: ది రోర్. ఫాతిమా సనా షేక్ ఇందులో ఏసీపీ జస్లీన్ సింగ్ సోని పాత్రలో కనిపించారు. ఓ ప్రభావవంతమైన బాబాపై 17 ఏళ్ల బాలిక చేసిన లైంగిక ఆరోపణల కేసు దర్యాప్తు చుట్టూ కథ తిరుగుతుంది. కేసు విచారణలో ఎదురయ్యే ప్రజా ఒత్తిడి, రాజకీయ ప్రభావాలు, దర్యాప్తు అధికారికి ఎదురయ్యే సవాళ్లు కథలో ఉత్కంఠను పెంచుతాయి. ఈ సినిమా జియో హాట్ స్టార్ లో తెలుగులోనూ అందుబాటులో ఉంది.
5. హాయ్! – (జీ 5)
నయనతార, కవిన్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘హాయ్!’ సినిమా ప్రేమకథలను ఇష్టపడే వారికి నచ్చేలా ఉంటుంది. ప్రేమ గురించి భిన్నమైన ఆలోచనలు కలిగిన ఇద్దరు వ్యక్తులు అనుకోకుండా ఒక ప్రయాణంలో కలుసుకోవడం.. ఆ పరిచయం వారి జీవితాలను ఎలా మార్చిందనేది కథలో ప్రధాన అంశం. భావోద్వేగాలకు ప్రాధాన్యమిస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రస్తుతం జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది.
6. డోంట్ బి షై – (అమెజాన్ ప్రైమ్)
యూత్‌ను టార్గెట్ చేస్తూ రూపొందిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘డోంట్ బి షై’ కూడా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. అలియా భట్ నిర్మాణ భాగస్వామ్యంతో రూపొందిన ఈ సినిమాలో కొత్త నటీనటులు ప్రధాన పాత్రల్లో కనిపించారు. కాలేజీ రోజుల్లో ప్రేమ, బ్రేకప్ తర్వాత ఎదురయ్యే భావోద్వేగ సంఘర్షణలు, తన జీవితాన్ని కొత్తగా మలుచుకునే ఓ యువతి ప్రయాణం చుట్టూ కథ సాగుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
7. హబీబీ – సోని లివ్
తమిళనాడులోని దక్షిణ ప్రాంత సంస్కృతి, అక్కడి తమిళ ముస్లిం సమాజ జీవన విధానాన్ని నేపథ్యంగా తీసుకుని రూపొందిన ఎమోషనల్ డ్రామా ‘హబీబీ’. మానవ సంబంధాలు, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలను ప్రధానంగా తీసుకుని తెరకెక్కించిన ఈ చిత్రం సున్నితమైన కథనంతో సాగుతుంది. భిన్నమైన సాంస్కృతిక నేపథ్యంతో కూడిన కథలను ఇష్టపడే వారికి ఇది ఆసక్తికరంగా ఉంటుంది. సోని లివ్ లో ఈ సినిమా తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.