Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం భీమ్లా నాయక్. మలయాళంలో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న అయ్యప్పనుమ్ కోషియం చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీగా అంచనాలున్నాయి. వకీల్ సాబ్ వంటి సూపర్ హిట్ తర్వాత పనవ్ నటిస్తోన్న సినిమా కావడంతో సహజంగానే ఈ చిత్రంపై ఎక్కడలేని క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్‌లుక్, టీజర్‌లు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో పవన్‌కు జోడిగా నిత్య మీనన్ నటిస్తుండగా, రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే అందిస్తోన్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే నేడు త్రివిక్రమ్ పుట్టిన రోజు ఈ సందర్భంగా భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ అదిరిపోయే గిఫ్ట్‌ను ఇచ్చింది. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాట నెట్టింట తెగ హంగామా చేస్తోంది. ఈ పాటకు త్రివిక్రమ్ లిరిక్స్ అందించడం విశేషం. డైలాగ్‌లో ప్రాసలు, పంచ్‌లతో ఆకట్టుకునే త్రివిక్రమ్ ఈ పాటలోనూ తనదైన ప్రాసలను జోడించాడు. పాటలోని లిరిక్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక సాంగ్ మేకింగ్ వీడియో కూడా ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తోంది. థమన్ డ్రమ్స్ వాయిస్తుండగా, మహిళా డ్యాన్సర్లు చేసిన డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అయితే అదే సమయంలో మరికొన్ని బడా సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉండడంతో భీమ్లా నాయక్ అనుకున్న సమయానికి వస్తాడా.? లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Viral News: తవ్వకాల్లో బయటపడ్డ పురాతన బానిస గది.. అందులో ఏముందో తెలిస్తే షాకే.!
AP Crime News: పత్తి తీసేందుకు వెళ్తుండగా.. ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కూలీల దుర్మరణం..