స్టార్‌ హీరోలతో సమానంగా.. సమంత భారీ కటౌట్..!

| Edited By:

Jul 04, 2019 | 8:39 AM

సమంత ఏయామ చేశావు సినిమాతో.. కుర్రకారుల మనసులను తనవైపుకు లాగేసుకుంది. ఆ తర్వాత చైతూ కూడా పడిపోయాడు. అది పక్కన పెడితే.. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే తప్ప.. థియేటర్స్ వద్ద పెద్దపెద్ద కటౌట్‌లు చూడలేము. అంలాటిది ఓ హీరోయిన్‌కి కటౌట్‌ పెట్టడమనేది సాధారణమైన విషయం కాదు. గతంలో అనుష్క కటౌట్స్‌ చూశాము.. ఆ తర్వాత సమంతాదే చూస్తున్నాం. సమంత అక్కినేనికి టాలీవుడ్‌లో ఎలాంటి ఇమేజ్ ఉందో అందరికీ తెలిసిందే. క్యూట్‌గా ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చే ఈ […]

స్టార్‌ హీరోలతో సమానంగా.. సమంత భారీ కటౌట్..!
Follow us on

సమంత ఏయామ చేశావు సినిమాతో.. కుర్రకారుల మనసులను తనవైపుకు లాగేసుకుంది. ఆ తర్వాత చైతూ కూడా పడిపోయాడు. అది పక్కన పెడితే.. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే తప్ప.. థియేటర్స్ వద్ద పెద్దపెద్ద కటౌట్‌లు చూడలేము. అంలాటిది ఓ హీరోయిన్‌కి కటౌట్‌ పెట్టడమనేది సాధారణమైన విషయం కాదు. గతంలో అనుష్క కటౌట్స్‌ చూశాము.. ఆ తర్వాత సమంతాదే చూస్తున్నాం.

సమంత అక్కినేనికి టాలీవుడ్‌లో ఎలాంటి ఇమేజ్ ఉందో అందరికీ తెలిసిందే. క్యూట్‌గా ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చే ఈ ముద్దుగుమ్మ సడన్‌గా బామ్మ అవతారమెత్తింది. ‘ఓ బేబీ’ లేడీ ఓరియేంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొరియా సినిమాను తెలుగులోకి ‘ఓ బేబి’గా రీమేక్ చేశారు. ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని దేవి 70 ఎంఎం థియేటర్ ముందు ఈ భారీ కటౌట్‌ను అభిమానులు ఏర్పాటు చేశారు. నందిని రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించింది.