“టీడీఎస్” మోసం.. హీరో అరెస్టుకు రంగం సిద్ధం

| Edited By: Pardhasaradhi Peri

Aug 03, 2019 | 10:53 AM

కోలీవుడ్ ప్రముఖ నటుడు విశాల్‌కు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాల్లో మినహాయించిన పన్నును(టీడీఎస్) సక్రమంగా చెల్లించని కేసులో ఈ వారెంట్ జారీ అయ్యింది. టీడీఎస్ సరిగా చెల్లించనందుకు గతంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు విశాల్‌కు నోటీసులు పంపారు. ఆ నోటీసులపై విశాల్ స్పందించకపోవడంతో ఎగ్మూరు కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన కోర్టు ఆగష్టు 2న విచారణకు నేరుగా హాజరు కావాలంటూ అతడిని […]

టీడీఎస్ మోసం..  హీరో అరెస్టుకు రంగం సిద్ధం
Follow us on

కోలీవుడ్ ప్రముఖ నటుడు విశాల్‌కు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాల్లో మినహాయించిన పన్నును(టీడీఎస్) సక్రమంగా చెల్లించని కేసులో ఈ వారెంట్ జారీ అయ్యింది. టీడీఎస్ సరిగా చెల్లించనందుకు గతంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు విశాల్‌కు నోటీసులు పంపారు. ఆ నోటీసులపై విశాల్ స్పందించకపోవడంతో ఎగ్మూరు కోర్టులో పిటిషన్ దాఖలైంది.

దీనిపై విచారించిన కోర్టు ఆగష్టు 2న విచారణకు నేరుగా హాజరు కావాలంటూ అతడిని ఆదేశించింది. కానీ నిన్నటి విచారణకు కూడా విశాల్ హాజరుకాలేదు. మరోవైపు కోర్టుకు విశాల్ హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలన్న విశాల్ తరఫు న్యాయవాదుల అభ్యర్థనను ఐటీ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. దీంతో తీవ్రంగా పరిగణించిన కోర్టు.. విశాల్‌పై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసి తదుపరి విచారణను ఈ నెల 28కు వాయిదా వేసింది.