‘డోరేమాన్’.. కార్టూన్ షోలంటే ఇష్టపడే వాళ్లకు ఈ పేరు ఎంతో సుపరిచితం. ముఖ్యంగా చిత్ర విచిత్రమైన గ్యాడ్జెట్లతో అన్నీ పనులు ఈజీగా చేస్తూ.. తన అల్లరితో అందరినీ ఆకట్టుకుంది డోరేమాన్. ఆ డోరేమాన్‌కు గాత్రానిచ్చిన గొంతు ఇప్పుడు మూగబోయింది. డోరేమాన్ కార్టూన్ షోలో డోరేమాన్ పాత్రకు డబ్బింగ్ చెప్పిన జపాన్ మహిళ నోబుయో ఒయామా ఇకలేరు.
‘డోరేమాన్’కు వాయిస్ డబ్బింగ్ ఇచ్చిన నటి నబుయో ఒయామా (90) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆమె సెప్టెంబర్ 29న కన్నుమూశారని కుటుంబీకులు శుక్రవారం ప్రకటించారు.
Voice actress Nobuyo Oyama, known for voicing Doraemon and Monokuma, has passed away at 90 years old due to old age. pic.twitter.com/JMmQIJFfSC
— Seiyuu Corner (@seiyuucorner) October 11, 2024
డోరేమాన్ కార్టూన్ ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన దిబెస్ట్ కార్టూన్ షో అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. డోరేమాన్ అంటే తమకు ఎప్పుడూ నోబుయో గొంతే గుర్తొస్తుందంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోబుయో 2005 వరకు డోరేమాన్ పాత్రకు డబ్బింగ్ చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..