Nikhil Spy: అంచనాలు అమాంతం చేసిన ‘స్పై’ ఫస్ట్‌ గ్లింప్స్‌.. నిఖిల్‌ ఖాతాలో మరో హిట్‌ పడేలా ఉందే..

|

Jun 06, 2022 | 12:54 PM

Nikhil Spy: నిఖిల్‌ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'స్పై'. థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నిఖిల్‌కు జోడిగా ఐశ్వర్యా మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న...

Nikhil Spy: అంచనాలు అమాంతం చేసిన స్పై ఫస్ట్‌ గ్లింప్స్‌.. నిఖిల్‌ ఖాతాలో మరో హిట్‌ పడేలా ఉందే..
Follow us on

Nikhil Spy: నిఖిల్‌ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘స్పై’. థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నిఖిల్‌కు జోడిగా ఐశ్వర్యా మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నిఖిల్‌ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చిత్ర యూనిట్ మొదట్లో విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ ఈ అంచనాలను అందుకుందని చెప్పాలి. ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్ ‘స్పై’ సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ను విడుదల చేసింది.  మంచు కొండల్లో ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్న నిఖిల్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది.

మంచు కొండల మధ్య ఉన్న బాక్సులో నుంచి వెపన్స్‌ తీసి సమరానికి సై అన్నట్లు వెళుతోన్న నిఖిల్‌ సన్నివేశాన్ని గ్లింప్స్‌లో చూపించారు.‘గూఢచారి’, ‘ఎవరు’, ‘హిట్‌’ వంటి సినిమాలకు ఎడిటర్‌గా పని చేసిన గ్యారీ బీహెచ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడం విశేషం. దీంతో ఆ సినిమాల తాలుకు లక్షణాలు స్పైలోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక స్పైతో నిఖిల్‌ ఖాతాలో మరో విజయం పక్కాఅన్నట్లు ఉంది గ్లింప్స్‌.

ఇక ఈ సినిమాకు శ్రీచరణ పాకాల సంగీతం అందిస్తుండగా, కె.రాజశేఖర్‌రెడ్డి నిర్మిస్తున్నాడు. హాలీవుడ్‌ టెక్నీషియన్‌ జులియన్‌ అమరు ఎస్త్రాడా సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తుండడం విశేషం. ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు దేశంలోని పలు ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ సినిమా దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..