Netflix New Rules: ప్రస్తుతం ఉన్న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అత్యధిక ఛార్జీలు వసూలు చేసేది ఏదంటే.. నెట్‌ఫ్లిక్స్ అనే చెప్పొచ్చు. అయినప్పటికీ నెట్‌ఫ్లిక్స్(NetFlix) తన రెవెన్యూని ఇంకా పెంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. సబ్‌స్క్రైబర్ల సంఖ్యను పెంచుకోవడంతో పాటు, యూజర్లు తమ పాస్‌వర్డ్‌లు, అకౌంట్స్‌ను మిత్రులతో షేర్ చేసుకోవడాన్ని కూడా నియంత్రించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. పాస్‌వర్డ్ షేరింగ్ సమస్యకు చెక్ పెడుతూ.. కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు.. పాస్‌వర్డ్ షేర్ చేసుకుంటే ఛార్జ్ వసూలు చేయాలని నెట్‌ఫ్లిక్స్ భావిస్తోంది. ఇందులో భాగంగానే పలు దేశాలల్లో కొత్త వినియోగదారుల కోసం ‘యాడ్ హోమ్’, ‘యాడ్ ఎక్స్‌ట్రా మెంబర్’ ఆప్షన్లను తీసుకువచ్చింది.
దీని ప్రకారం.. సబ్‌స్క్రైబర్లు ఒకే ఇంట్లో నివసిస్తున్న వారిని యాడ్ చేయడానికి ఒక ‘హోమ్’ క్రియేట్ చేసుకోవాలి. ఆ హోమ్‌లోని వ్యక్తులందరూ నెట్‌ఫ్లిక్స్‌ను ఏ డివైజ్‌లోనైనా యాక్సెస్ చేయవచ్చు. ఇంటి నుంచి బయటికి వెళ్లి ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా వాడుకోవచ్చు. అయితే, మరొక ఇంటిలోని వ్యక్తికి మీ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌కు యాక్సెస్ ఇవ్వాలంటే మాత్రం కొంతమేర ఛార్జీ చెల్లించుకోవాల్సిందే. యాడ్ ఎక్స్‌ట్రా మెంబర్స్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. దీనికి అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం పలు దేశాల్లో మాత్రమే అమలు చేస్తున్న ఈ ఫీచర్.. భారత్‌లోకి ఎప్పుడొస్తుందనేది మాత్రం తెలియదు.
మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..