AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పర్యాటక ప్రాంతాల్లో జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుక.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన..

జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుకలను దేశంలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 72వ జాతీయ ఫిల్మ్ అవార్డుల వేడుక సెప్టెంబర్ 22న గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో జరగనుంది. భవిష్యత్ వేడుకలకు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసే విధానంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరాలు వెల్లడించారు. సినిమా, పర్యాటక రంగాల అనుసంధానమే లక్ష్యంగా ఈ మార్పు చేపట్టారు.

పర్యాటక ప్రాంతాల్లో జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుక.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన..
Ashwini Vaishnaw
Shaik Madar Saheb
|

Updated on: Sep 22, 2026 | 1:10 PM

Share

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ చలనచిత్ర పురస్కారాల (National Film Awards) వేడుకల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు కేవలం నాలుగు గోడల కాన్ఫరెన్స్ హాళ్లకే పరిమితమైన ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని, ఇకపై దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల (Tourist Destinations) ప్రాంగణాల్లో ప్రజల మధ్య అట్టహాసంగా నిర్వహించనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం కీలక ప్రకటన చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలు, స్పూర్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఏక్తా నగర్ వేదికగా త్వరలో అట్టహాసంగా వేడుకలు

ఈ నూతన విధానంలో భాగంగా, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) నెలకొల్పిన గుజరాత్‌లోని ‘ఏక్తా నగర్’ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందింది. ఇటువంటి అత్యంత మనోహరమైన పర్యాటక ప్రాంతంలో భారత గౌరవ రాష్ట్రపతి స్వయంగా పాల్గొని, దేశవ్యాప్తంగా ఉన్న సినీ రంగానికి చెందిన దిగ్గజ కళాకారులకు అవార్డులు అందజేయనున్నారు. దీనివల్ల ఆయా పర్యాటక ప్రాంతాల ప్రత్యేకతలు, విశిష్టత గురించి ప్రపంచానికి మరింతగా తెలిసే అవకాశం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రాలకు ఆహ్వానం – పోటీ ప్రాతిపదికన ఎంపిక

ఈ సందర్భంగా దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర మంత్రి ఒక కీలక విజ్ఞప్తి చేశారు.. ప్రతి రాష్ట్రం తమ పరిధిలోని అత్యుత్తమ పర్యాటక ప్రాంతాల జాబితాతో ప్రతిపాదనలు (Proposals) పంపాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు (Facilities), 360-డిగ్రీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేయాలన్నారు. రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనల్లో అత్యుత్తమంగా నిలిచిన పర్యాటక ప్రాంతాన్ని తదుపరి జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుకకు వేదికగా ఎంపిక చేస్తారని తెలిపారు.

జి-20 ఆదర్శంగా సినిమా – పర్యాటకరంగాల అనుసంధానం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో జి-20 (G20) సమావేశాలను కేవలం రాజధాని ఢిల్లీకే పరిమితం చేయకుండా దేశంలోని ప్రతి మూలకు, ప్రతి రాష్ట్రానికి తీసుకెళ్లారని మంత్రి గుర్తుచేశారు. అదే ఆలోచనా దృక్పథంతో (Thought Process) ఇప్పుడు జాతీయ చలనచిత్ర పురస్కారాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. సినిమా, పర్యాటక రంగాలను ఇలా ఒకే వేదికపైకి తీసుకురావడం వల్ల.. ఆయా పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం లభించి, ఆర్థికంగా ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు.

Follow Us
పర్యాటక ప్రాంతాల్లో జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుక..
పర్యాటక ప్రాంతాల్లో జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుక..
భక్తులు ఆ చెట్టుపై ఉంది తొలుత కోతి ఏమో అనుకున్నారు.. కానీ
భక్తులు ఆ చెట్టుపై ఉంది తొలుత కోతి ఏమో అనుకున్నారు.. కానీ
డిసెంబర్‌ రేసులో మరో మూవీ.. హీట్ పెంచుతున్న స్టార్స్‌
డిసెంబర్‌ రేసులో మరో మూవీ.. హీట్ పెంచుతున్న స్టార్స్‌
మంగళగిరి లక్ష్మీనరసింహ ఆలయానికి కొత్త మెరుగులు..
మంగళగిరి లక్ష్మీనరసింహ ఆలయానికి కొత్త మెరుగులు..
2 ఏళ్లుగా ఓటీటీలో తగ్గని డిమాండ్.. ఏం చూస్తున్నారు భయ్యా..
2 ఏళ్లుగా ఓటీటీలో తగ్గని డిమాండ్.. ఏం చూస్తున్నారు భయ్యా..
పొంగల్‌తో మొదలైన విద్యార్థుల కొత్త అధ్యాయం..!
పొంగల్‌తో మొదలైన విద్యార్థుల కొత్త అధ్యాయం..!
5 ఓవర్ల మ్యాచ్.. అరుదైన రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్
5 ఓవర్ల మ్యాచ్.. అరుదైన రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్
స్ట్రెచ్ మార్క్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?డాక్టర్లు చెప్పిన చిట్కా
స్ట్రెచ్ మార్క్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?డాక్టర్లు చెప్పిన చిట్కా
అజిత్ రేసింగ్ జర్నీ డాక్యుమెంటరీ గ్లాడియేటర్స్ ట్రైలర్ రివ్యూ
అజిత్ రేసింగ్ జర్నీ డాక్యుమెంటరీ గ్లాడియేటర్స్ ట్రైలర్ రివ్యూ
ఇంత టాలెంటెడ్‏గా ఉన్నావేంటీ బ్రో.. సుమతో కలిసి డ్యాన్స్ ఇరగదీశాడు
ఇంత టాలెంటెడ్‏గా ఉన్నావేంటీ బ్రో.. సుమతో కలిసి డ్యాన్స్ ఇరగదీశాడు