అక్కినేని నాగచైతన్య.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘లవ్ స్టోరీ’. ఇందులో నాగచైతన్యకు జోడీగా ఫిదా ఫేం సాయి పల్లవి నటిస్తోంది. ఫిదా సినిమా తర్వాత శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న చిత్రం లవ్ స్టోరీ కావడంతో ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ‘లవ్ స్టోరీ’ టీజర్ అప్డేట్ వచ్చేసింది.
నాగచైతన్య, సాయిపల్లవి కలిసి నటిస్తున్న లవ్ స్టోరీ సినిమా టీజర్ జనవరి 10న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ బ్యూటీఫుల్ ఫోటోను కూడా షేర్ చేశారు మేకర్స్. ఆ ఫోటో ఎంతో కలర్ ఫుల్గా ఉంది. ఈ సినిమాను సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ మరియు అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నారాయణ దాస్ కె.నారంగ్ పుష్కర్ రామ్మోహన్ రావ్ నిర్మాతలుగా ఉన్నారు.
“When you want something, all the universe conspires in helping you to achieve it.” @chay_akkineni & @sai_pallavi92 ‘s LoveStory is one such!
Teaser on Jan 10th at 10:08am.#LoveStoryTeaser@sekharkammula @SVCLLP #AmigosCreations @pawanch19 @adityamusic pic.twitter.com/NhjJZgvLkr
— Suniel Narang (@AsianSuniel) January 7, 2021
Also Read:
Rashmika Mandanna: ఇష్టమైన కారు కొనుకున్న విజయ్ హీరోయిన్.. నెట్టింట్లో ఫోటోలు వైరల్..
Akkineni Nagachaithanya: ఆ సినిమా కోసం సమంతకు నో చెప్పిన నాగచైతన్య.. ఏ మూవీ అంటే ?