యంగ్ హీరో నాగశౌర్యకు గాయాలు..!

| Edited By:

Jun 15, 2019 | 7:29 PM

ఇటీవల కాలంలో టాలీవుడ్ హీరోలు.. షూటింగ్ సమయంలో గాయపడుతున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్.. ఆ తర్వాత రామ్ చరణ్ వరుసగా గాయాలపాలైతే.. ఇప్పుడు యంగ్ హీరో నాగశౌర్య తన కొత్త చిత్రం షూటింగ్ సమయంలో గాయాలపాలయ్యారు. ఆయన తాజాగా కొత్త దర్శకుడు రమణతేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మెహ్రీన్ కౌర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ పరిసరాల్లో జరుగుతోంది. […]

యంగ్ హీరో నాగశౌర్యకు గాయాలు..!
Follow us on

ఇటీవల కాలంలో టాలీవుడ్ హీరోలు.. షూటింగ్ సమయంలో గాయపడుతున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్.. ఆ తర్వాత రామ్ చరణ్ వరుసగా గాయాలపాలైతే.. ఇప్పుడు యంగ్ హీరో నాగశౌర్య తన కొత్త చిత్రం షూటింగ్ సమయంలో గాయాలపాలయ్యారు. ఆయన తాజాగా కొత్త దర్శకుడు రమణతేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మెహ్రీన్ కౌర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ పరిసరాల్లో జరుగుతోంది. ఓ భారీ యాక్షన్ సన్నివేశంలో నాగశౌర్య రోప్, డూప్ లేకుండా నటించడంతో.. ఆయన ఎడమ కాలికి తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో నాగశౌర్యను వైజాగ్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఇకపోతే గాయాన్ని పరీక్షించిన వైద్యులు 25 రోజులు పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కాగా ఈ సినిమా నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌లో తెరకెక్కుతోంది.