మహానటి సినిమా మంచి విజయం సాధించడంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ఓ సినిమా తీయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ భారీ బడ్డెట్‌తో ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్లుగా ప్రకటించారు. అంతే కాకుండా ప్రభాస్ తన కెరీర్లో 21వ చిత్రంగా ఈ సినిమా రాబోతుందని.. అందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించనున్నట్లుగా తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి కీలక పాత్రలో నటించనున్నారని తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే నాగ్ అశ్విన్‌తో సినిమా ప్రారంభం అవుతుందని అనుకున్నారు. అయితే ఇప్పటి వరకు వీరిద్దరికి సంబంధించిన ప్రాజెక్ట్ గురించి అనేక అనుమానాలు వెలువడ్డాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విషయం నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ సినిమా నుంచి న్యూ ఇయర్ లేదా సంక్రాతికి ఏదైనా అప్డేడ్ ఉందా? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు నాగ్ అశ్విన్ రిప్లై ఇచ్చాడు. సంక్రాంతి తర్వాత మన సినిమా అప్డేట్ ఉంటుందని.. వర్క్ ఫుల్ ఫ్లోలో నడుస్తోందని నాగ్ అశ్విన్ చెప్పాడు. దీంతో నాగ్ అశ్విన్- ప్రభాస్ ప్రాజెక్ట్ పై ఓ క్లారిటీ వచ్చినట్లైంది. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత ఆదిపురుష్ చిత్రాన్ని ఆగస్ట్ 11న రిలీజ్ చేయనున్నట్లుగా తెలిపారు. వీటితోపాటు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సలార్ సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.