Nabha Natesh : సుధీర్ బాబు నటించిన ‘నన్నుదోచుకుందువటే’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన చిన్నది నభనటేష్. ఆతర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఒక్కసారిగా ఈ అమ్మడికి క్రేజ్ పెరిగిపోయింది. ఆ సినిమాలో నభనటేష్ అందాలకు,నటనకు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఈ ముద్దుగుమ్మ ఇటీవల ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేస్తున్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. సౌత్ లో మాస్ సినిమాలంటే తన కు చాలా ఇష్టమని సినిమాల్లోకి రాకముందు చాలా మాస్ సినిమాలు చూశానని అంటుంది నభ. అందుకే మాస్ క్యారెక్టర్ లో ఈజీగా ఇమిడిపోగలుగుతున్నా అని అంటుంది నభనటేష్. బయటకు క్లాస్ గా కనిపిస్తాను కానీ తన లోపల చాలా మాస్ వర్షన్ ఉంది అని అంటుంది నభ నటేష్. ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ.. తనకు పెళ్ళీపైన ఎలాంటి అభిప్రాయం లేదు. ఇప్పట్లో పెళ్లి ఆలోచనకూడా లేదు.. నా దృష్టాంతా పూర్తిగా సినిమాలపైనే ఉంది అని చెప్పు కొచ్చింది ఈ ఇస్మార్ట్ బ్యూటీ.
also read : Pawan Kalyan-Rana Movie : పవన్ కళ్యాణ్- రానా సినిమా షూటింగ్ మొదలైయేది అప్పుడేనా.?