మహేశ్‌బాబుతో నటించడం నా డ్రీమ్ రోల్.. టీచర్ పాత్ర కోసం చాలా కష్టపడ్డానంటున్న అందాల తార..

Musskan Sethi: ఢ‌మ‌రుకం’ ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన కొత్త చిత్రం ‘రాధాకృష్ణ’. తెలంగాణలోని నిర్మల్ బొమ్మల నేపథ్యంలో

మహేశ్‌బాబుతో నటించడం నా డ్రీమ్ రోల్.. టీచర్ పాత్ర కోసం చాలా కష్టపడ్డానంటున్న అందాల తార..

Updated on: Feb 05, 2021 | 8:37 AM

Musskan Sethi: ఢ‌మ‌రుకం’ ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన కొత్త చిత్రం ‘రాధాకృష్ణ’. తెలంగాణలోని నిర్మల్ బొమ్మల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఇందుల అనురాగ్, ముస్కాన్ సేథీ హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే సినిమా గురించి హీరోయిన్ పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు.

సినిమాలో తన పాత్ర పేరు రాధా అని చాలా సంప్రదాయబద్దంగా ఉండే పాత్రని చెప్పారు. నిర్మల్ బొమ్మలకు ఆదరణ తగ్గడంతో ఆ బొమ్మలు చేసేవారి జీవనోపాధి దెబ్బతింది. అలాంటి వారికి సాయం చేసే పాత్రలో నటించానని తెలిపింది. అంతేకాకుండా ఇందులో డ్యాన్స్ టీచర్ పాత్రలో కనిపిస్తానని అందుకోసం చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది. సినిమాలో అనవసరమైన కామెడీ ఉండదని, కథలో సీరియస్ నెస్ ఉంటుందని పేర్కొంది. అయితే మీకు ఏమైనా డ్రీమ్ రోల్స్ ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించడం తన డ్రీమ్ రోల్ అని తెలిపింది.

ఆదిలాబాద్‌లో మహిళా వేధింపులకు బీఎస్ఎఫ్ జవాన్ ఆత్మహత్య.. కారణమేంటో తెలిస్తే షాక్ అవుతారు..

Loading...
Unable to load recommendations.
Follow Us