Puri Jagannadh: దేవుడు ఉన్నాడా? లేడా?.. ఫ్యాన్స్‌కు ఫుల్ క్లారిటీ ఇచ్చిన పూరీ జగన్నాథ్.. వీడియో వైరల్..

|

Aug 11, 2021 | 6:06 AM

Puri Jagannadh: సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ పూరీ. కాంట్రవర్సీ డైరెక్టర్ ఆర్‌జివి శిష్యుడు అయిన పూరీ జగన్నాథ్..

Puri Jagannadh: దేవుడు ఉన్నాడా? లేడా?.. ఫ్యాన్స్‌కు ఫుల్ క్లారిటీ ఇచ్చిన పూరీ జగన్నాథ్.. వీడియో వైరల్..
Puri Jagannadh
Follow us on

Puri Jagannadh: సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ పూరీ. కాంట్రవర్సీ డైరెక్టర్ ఆర్‌జివి శిష్యుడు అయిన పూరీ జగన్నాథ్.. అచ్చం ఆయనలాగే ప్రవర్తిస్తుంటారు. మొహమాటం లేకుండా ముక్కు సూటిగా మాట్లాడేస్తుంటారు. తన మనసులో ఏముందో బయటకు కూడా అదే అనేస్తుంటారు. అయితే, నాస్తికుడిగా గుర్తింపు పొందిన పూరి జగన్నాథ్.. దేవుడు అంశంపై నిత్యం ఏదో రూపంలో కామెంట్స్ చేస్తుంటాడు. తాజాగా మరోసారి స్పందించాడు. ఈసారి ఏకంగా దేవుడు ఉన్నాడా? లేడా? అంటూ ఫ్యాన్స్ కోసం యూట్యూబ్‌లో ఒక వీడియో వదిలాడు. దేవుడు ఉన్నాడా? లేడా? అని ప్రశ్నిస్తూనే.. అసలు దేవుడు ఎవరు? ఎలా ఉంటారు? అంటూ వివరిస్తూ ఫైనల్ ఆన్సర్ కూడా తానే ఇచ్చేశాడు.

మరి దేవుడు ఉన్నాడా? లేడా? అనే ప్రశ్నకు పూరీ ఏ వివరణ ఇచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం. యూట్యూబ్ వీడియోలో ఆయన ఏమన్నాడో యధావిధంగా.. ‘‘దేవుడు ఉన్నాడా? లేడా? ఎక్కువ చెప్పొద్దు.. ఉన్నాడా? లేడా? ఒక్క మాటలో చెప్పండి అని ఒక వ్యక్తి జిడ్డు కృష్ణమూర్తిని ఒకరోజు నిలదీసి అడిగారు. జిడ్డు కృష్ణమూర్తి చాలా మంచి మనిషి కాబట్టి.. చాలా సున్నితంగా సమాధానం చెప్పారు. అయినా వాడికి అర్థం కాలేదు. ఇప్పటికీ చాలా మందిలో ఉన్న ప్రశ్న ఇది. సున్నితంగా చెబితే కుదరదు కాబట్టి.. కొంచెం అర్థం అయ్యేలా చెబుతాను. దేవుడు మనిషిని చేశాడా? మనిషి దేవుడిని చేశాడా? అనేవి రెండు ప్రశ్నలు.’’

‘‘పాయింట్ నెంబర్ 1.. దేవుడు మనుషులను తయారు చేశాడనే అనుకుందాం. స్టీవ్ జాబ్స్ తయారు చేసిన ఐ ఫోన్ ఎక్సలెంట్ పీస్, ఎలన్ మస్క్ తయారు చేసిన టెస్లా కారు అమేజింగ్ పీస్. మరి వీళ్లు చేసినవే అద్భుతాలు అయితే.. అంతటి పవర్‌ఫుల్ దేవుడు చేసిన మనుషులు ఎలా ఉండాలి? ఏ రేంజ్‌లో ఉండాలి? ఒక్కొక్కడు మైండ్ బ్లోయింగ్ అయి ఉండాలి. కానీ అలా లేమే. ఎవడిని పట్టుకున్నా డౌట్లు, కన్‌ఫ్యూజన్లు, భయాలు, మనశ్శాంతి లేదు. ప్రాబ్లమ్స్ వస్తే గాల్లోకి చూస్తుంటాం. బుర్ర గోక్కుంటాం. ఎక్కెక్కి ఏడ్చేస్తాం. ఎన్ని మ్యానుఫ్యాచరింగ్స్. మనం దేవుడి పిల్లలం అని అందరం అనుకుంటాం. దేవుడికి పుట్టాం. మనం కూడా దేవుడిలో ఒక భాగం. అయితే నిజంగానే మనం దేవుడికి పుడితే.. దేవుడికి ఉన్న మంచి లక్షణాలేవైనా మనలో ఉన్నాయోమో చూద్దాం. దేవుడిలా అందరినీ ప్రేమించడం రాదు. పక్కోడి మీద కరుణా లేదు. కనికరం అసలే లేదు. సాయం చేసే గుణం లేదు. అంగుళం, అంగుళం టార్చ్ లైట్ పట్టుకుని గాలించినా.. దైవత్వం అనేది మనలో ఏ మూలనా కనిపించదు. ఇన్ని చెత్త క్వాలిటీస్‌తో దేవుడు తన పిల్లలను తయారు చేసుకోడు కాబట్టి. కచ్చితంగా మనం దేవుడి పిల్లలం కాదు. పుడితే ఏ దయ్యానికో పుట్టి ఉంటాం తప్ప.. దేవుడికి మాత్రం పుట్టి ఉండం.’’

‘‘పాయింట్ నెంబర్ 2.. మనిషే దేవుడిని చేశాడనుకుందాం. అయితే, ఆ దేవుడు ఎలా పుట్టాడు?. ఐన్‌స్టీన్ డిజైన్ చేశాడా దేవుడిని. న్యూటన్ లాంటి జీనియస్‌లు డిజైన్ చేశారా? లేదు. మనలాంటి యావరేజ్, బిలో యావరేజ్ ప్రజలంతా కలిసి డిజైన్ చేశారు. వాళ్ల భయం నుంచి, ఆకలి నుంచి, ఆశల నుంచి, తీరని కోరికల నుంచి దేవుడు పుట్టాడు. దేవుడి మీద నమ్మశక్యం కాని స్టోరీలు రాశారు. లాజిక్‌కి అందని సీన్స్ క్రియేట్ చేశారు. మనుషులతో కలిపి దేవుడికి కూడా క్యారెక్టర్ రాసేశారు. స్వర్గమనే ఊహాలోకాన్ని క్రియేట్ చేశారు. అదే చివరి గమ్యం అని చెప్పి.. ఇక్కడ టికెట్స్ అమ్మేస్తున్నారు. అదెక్కడుందో ఎవడికీ తెలియదు. అలాంటి క్లబ్‌ భూమిపై చాలా ఉన్నాయి. ఏ మెంబర్ షిప్ తీసుకోవాలి. ఏ బొమ్మను మొక్కాలి. కాబట్టి దయనీయమైన, గందరగోళ మనస్తత్వం నుంచి పుట్టిన ఏ దేవుడు కూడా నిజం కాదు. ఎవరైనా దేవుడు ఉన్నాడా? లేడా? అని అడిగితే. లేడు అని చెప్పండి. ఎందుకంటే.. వాళ్లు అనుకుంటున్న దేవుడు మాత్రం ఈ ప్రపంచంలో లేడు. ఒకవేళ ఆ పైన ఇంకెవరైనా ఉంటే.. వాడి పేరు మాత్రం దేవుడు కాదు.’’ అంటూ పూరీ తనదైన శైలిలో వివరించాడు.

Also read:

Crime News: తల్లిని బెదిరించి ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం.. ఆపై పురుగుల మందు తాగించి..

Immunity booster : పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ ఆహారాన్ని తినిపించండి..

Viral Video: హలో బ్రదర్ ఇదేం డ్యాన్స్.. ఇలా కూడా చేస్తారా?.. వీడియో చూడండి.. కడుపుబ్బా నవ్వుకోండి..