మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రెటీస్గా ఆ ఇద్దరు స్టార్స్ రికార్డు సృష్టించారు. న్యూయర్క్కు చెందిన మల్టీనేషనల్ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ సంస్థ డఫ్ & ఫెల్ప్స్ తన ఏడవ ఎడిషన్ సెలబ్రెటీ బ్రాండ్ వాల్యుయేషన్ 2021ని ప్రకటించింది. ఇందులో అత్యంత వాల్యుబుల్ సెలబ్రెటీస్గా టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే నిలిచారు.
డఫ్ & ఫెల్ప్స్ అధ్యయనాల ప్రకారం దేశవ్యాప్తంగా మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రెటీల జాబితాను అందిస్తుంది. ఇందులో విరాట్ కోహ్లీ 2020 సెలబ్రెటీ బ్రాండ్ వాల్యుబుల్ జాబితాలో టాప్ ప్లేస్లో నిలిచారు. ఇక రెండవ స్థానంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నిలిచారు. అక్షయ్ కుమార్ కంటే విరాట్ కోహ్లీ మోస్ట్ వాల్యూబుల్ జాబితాలో మొదటి స్థానంలో ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా.. 2020లో విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ 237.7 మిలియన్ డాలర్లు (రూ.1733.79 కోట్లు), కాగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ బ్రాండ్ వాల్యూ 118.9 మిలియన్ డాలర్లు (రూ.867.26 కోట్లు), మూడో స్థానంలో రణవీర్ సింగ్ నిలవగా.. అతని బ్రాండ్ వాల్యు 102.9 మిలియన్ డాలర్లు (750.4 కోట్లు)గా ఉంది.
ఇక బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే బ్రాండ్ వాల్యూ 450.4 మిలియన్ డాలర్లతో నాలుగవ స్థానంలో నిలిచింది. టాప్ మేల్ సెలబ్రెటీలను దీపికా వెనక్కు నెట్టింది. ఈ జాబితాలో దీపిక తర్వాతి స్థానంలో అలియా భట్, అనుష్క శర్మ మరియు కరీనా కపూర్ నిలిచారు.
Also Read: