మోహన్‌బాబుకు చిరు ఆలింగనం.. ఫొటో ఆఫ్ ది డే

మా డైరీ ఆవిష్కరణలో చిరంజీవి ప్రసంగానికి రాజశేఖర్ అడ్డుపడటాన్ని మోహన్ బాబు ఖండించారు. ఇలాంటి ఘటనలు దురుదృష్టకరమని మోహన్ బాబు అన్నారు. తనకు, చిరంజీవికి మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. తమ రెండు కుటుంబాలు ఎప్పటికీ ఒక్కటేనని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు కూడా వేదికల మీద కలిసినప్పుడు ఒకరి మీద ఒకరు ఛలోక్తులు విసురుకునేవారన్న మోహన్ బాబు.. చిరుతో తన బంధం కూడా అలాంటిదేనని తెలిపారు. ఒకరి గురించి ఒకరం సరాదాగా మాట్లాడుకుంటామని చెప్పుకొచ్చారు. […]

మోహన్‌బాబుకు చిరు ఆలింగనం.. ఫొటో ఆఫ్ ది డే

Edited By:

Updated on: Jan 02, 2020 | 3:46 PM

మా డైరీ ఆవిష్కరణలో చిరంజీవి ప్రసంగానికి రాజశేఖర్ అడ్డుపడటాన్ని మోహన్ బాబు ఖండించారు. ఇలాంటి ఘటనలు దురుదృష్టకరమని మోహన్ బాబు అన్నారు. తనకు, చిరంజీవికి మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. తమ రెండు కుటుంబాలు ఎప్పటికీ ఒక్కటేనని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు కూడా వేదికల మీద కలిసినప్పుడు ఒకరి మీద ఒకరు ఛలోక్తులు విసురుకునేవారన్న మోహన్ బాబు.. చిరుతో తన బంధం కూడా అలాంటిదేనని తెలిపారు. ఒకరి గురించి ఒకరం సరాదాగా మాట్లాడుకుంటామని చెప్పుకొచ్చారు.

ఇక మనమంతా ఒకే తల్లి బిడ్డలం.. కలిసిమెలిసి ముందుకువెళ్తామని ఈ సందర్భంగా సూచించారు. మా ఎవడబ్బ సొత్తు కాదని, అందరి సొత్తు అని ఆయన అన్నారు. అయితే మోహన్ బాబు ఈ మాటలు చెబుతుండగానే చిరు ఆయన దగ్గరకు వచ్చి కౌగలించుకున్నారు. అంతేకాదు మోహన్ బాబు బుగ్గపై ముద్దు పెట్టి.. తమ బంధం గురించి చెప్పకనే చెప్పారు. అంతేకాదు చిరంజీవి సతీమణి సురేఖ తనకు చెల్లెలు లాంటిదని.. చిరు తన భార్యకు భయపడుతాడంటూ సరదాగా కామెంట్లు చేశారు మోహన్ బాబు.