Meghana Raj Baby Shower: యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు, కన్నడ నటుడు చిరంజీవి సర్జా ఈ ఏడాది జూన్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. గుండెపోటుతో ఆసుపత్రి చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. అయితే ఆ సమయానికి చిరంజీవి భార్య, నటి మేఘనా రాజ్ మూడు నెలల గర్భవతి. ఇక ఇటీవల మేఘనా సీమంతం వేడుకలు ఆమె పుట్టింటిలో జరిగాయి. ఈ సందర్భంగా ఆ కార్యక్రమంలో మరణించిన తన భర్త ఫొటోను పక్కన పెట్టించుకొంది మేఘనా. ఇక ఈ వేడుకలో చిరంజీవి సర్జా కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఫొటోలను మేఘనా తన సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా.. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. వాటికి గాడ్ బ్లెస్ యువర్ బేబి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా దాదాపు 8 ఏళ్ల పాటు చిరంజీవి, మేఘనా ప్రేమించుకోగా.. 2018లో ఈ ఇద్దరు వివాహం చేసుకున్న విషయం విదితమే.
Read More:
‘కార్తికేయ 2’ సెట్స్‌పైకి వెళ్లేది అప్పుడే
కరోనా ఎఫెక్ట్.. దేవరగట్టు బన్నీ ఉత్సవం రద్దు