సోషల్ మీడియాలోకి రావడానికి అసలు కారణం చెప్పిన చిరు..!

సోషల్ మీడియాలోకి లేటుగా ఎంట్రీ ఇచ్చినా యాక్టివ్‌గా ఉంటూ దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. అక్కడ తన అభిప్రాయాలు పంచుకుంటూ..

సోషల్ మీడియాలోకి రావడానికి అసలు కారణం చెప్పిన చిరు..!

Edited By:

Updated on: Apr 21, 2020 | 8:30 AM

సోషల్ మీడియాలోకి లేటుగా ఎంట్రీ ఇచ్చినా యాక్టివ్‌గా ఉంటూ దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. అక్కడ తన అభిప్రాయాలు పంచుకుంటూ.. లాక్‌డౌన్‌ సమయంలో ఫ్యాన్స్‌కు మరింత దగ్గరవుతున్నారు చిరు. అయితే సోషల్ మీడియాలోకి రావడానికి ఎందుకింత ఆలస్యం అయ్యింది అన్న ప్రశ్నకు ఇటీవల చిరు స్పందించారు.

”దిశ ఘటన సమయంలో ఎంతో ఆవేదనకు గురయ్యా. ఆ సమయంలో నా ఆవేదనను పంచుకోవడానికి సోషల్ మీడియాలో అకౌంట్‌ ఉంటే బాగుండేదని అనిపించింది. ప్రెస్‌నోట్ విడుదల చేస్తే అది ప్రజలకు చేరి ఉంటుంది కానీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన భావాలను నేరుగా తెలియజేస్తే అది మరింత ప్రభావవంతంగా ఉంటుంది అనిపించింది. ఇక కరోనా ముప్పు ముంచుకొస్తోన్న సమయంలో ప్రజలకు తగిన సూచనలు ఇవ్వడానికి, ప్రజలతో తన భావాలను పంచుకోవడానికి సోషల్ మీడియాలోకి రావాలని గట్టిగా నిర్ణయించుకున్నా” అని అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు. ఏదేమైనా చిరు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆయన ఫ్యాన్స్‌ చాలా సంతోషపడ్డారు. ఇక ఇప్పుడు కరోనా క్రైసిస్ సమయంలో టాలీవుడ్‌ పెద్దన్నగా చిరు పోషిస్తోన్న పాత్రపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Read This Story Also: కరోనాపై ‘ర్యాప్‌ సాంగ్‌’ విడుదల చేసిన సీపీ సజ్జనార్..!